సీరియస్ గా ఉంటూనే కామెడి చేస్తా: మహేష్ బాబు
ఇన్నాళ్ళూ ఇంట్లోనే వుంటూ ట్విట్టర్ లో సిట్టింగ్ వేసిన మహేష్ నేడు బయటికి వచ్చారు. చాలా కాలం తర్వాత మీడియాతో ముచ్చటించారు. మరి అవసరం అలాంటిది కదా. మొత్తానికి తన 'ఖలేజా" గురించి చెప్పుకోవడానికి తన తాజా చిత్రాన్ని నిలబెట్టుకోవడానికి ప్రచారమే పరమావదిగా భావిస్తూ రంగంలోకి దిగిన ప్రిన్స్ ఇలా మాట్లాడుతూ మూడేళ్ళ తర్వాత రిలీజైన నా సినిమా 'ఖలేజా"కి అన్ని చోట్లా అద్బుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. నా వరకూ నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఇదేనని నా ఫీలింగ్.
ముఖ్యంగా 'ఈ సినిమాలో నన్ను పాలీ అనే గ్రామానికి చెందిన ప్రజలు 'దేవుడు"లా భావిస్తారు. అది రిస్కీ పాయింట్. ఏ మాత్రం కరెక్ట్ గా చెప్పకపోయినా సినిమా తేలిపోతుంది. అందుకే.... మనకు సహాయం చేసే ఎవరైనా సరే దేవుడితో సమానమే అని సజెషన్ ఇచ్చి, నా క్యారెక్టర్ ను ఆ ఊరి ప్రజలు ఎందుకు దేవుడిలా భావిస్తారో చెప్పాం. ఈ సినిమాలో ప్రతి సీన్ కష్టమే. సీరియస్ గా ఉంటూనే కామెడీ చేస్తాను. అలా చేయడం ఆషామాషీ విషయం కాదు. ముఖ్యంగా క్లయిమాక్స్ ఫైట్ ను చాలా ఎమోషనల్ గా చేయాల్సి వచ్చినప్పుడు కాస్తంత భయం వేసింది. అయినా బాగా చేయగలిగాను" అని అన్నారు.


Click it and Unblock the Notifications











