మన కుమార్తెలు సురక్షితంగా ఉంటారా?.. సింగరేణి కాలనీ ఘటనపై మహేష్ బాబు సీరియస్

హైదరాబాద్ నగరంలో చాలా కాలం తర్వాత ఒక దారుణమైన అత్యాచార ఘటన అందరినీ కలచివేసింది. సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై ఒక రాక్షసుడు అతి దారుణంగా తన రాక్షసత్వాన్ని చూపించడంతో అలాంటి వారికి భూమిమీద బ్రతికే అర్హత కూడా లేదని 24 గంటల్లోనే ఉరితీయాలని ఇప్పటికే చాలామంది స్పందించారు. ఇక మంచు మనోజ్ తనదైన శైలిలో బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచాడు. ఇక మెల్లగా మిగతా సినీ తారలు కూడా నిందితుడికి వీలైనంత త్వరగా శిక్ష పడాలని కోరుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరోసారి తన వివరణ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడిని వదిలి పెట్టకూడదని కూడా మహేష్ బాబు తీవ్రస్థాయిలో సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

Recommended Video

Singareni Colony ఘటనపై Mahesh Babu ఆగ్రహం, రాజు ఆచూకీ తెలిపితే 10 లక్షలు || Filmibeat Telugu
 నిందితుడిని పట్టిస్తే పది లక్షలు

నిందితుడిని పట్టిస్తే పది లక్షలు

ఇటీవల సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై 30 ఏళ్ల యువకుడు దారుణంగా అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన రోజు నుంచి కూడా పోలీసులు ఆ రాక్షసుడి కోసం గాలిస్తున్నారు. పాపపై అత్యాచారం చేయడమే కాకుండా అతి దారుణంగా చంపేసిన నిందితుడు వివరాలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన పోలీసులు పట్టించిన వారికి పది లక్షల కూడా ఇస్తామని తెలిపారు.

 కుమార్తెలు సురక్షితంగా ఉంటారా?

కుమార్తెలు సురక్షితంగా ఉంటారా?

ఇక ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వివరణ ఇచ్చారు. సింగరేణి కాలనీలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఘోరమైన నేరంతో మనం సమాజం ఎంత దారుణంగా పడిపోయిందో గుర్తు చేస్తుంది. "మన కుమార్తెలు ఎప్పుడైనా సురక్షితంగా ఉంటారా?" అనేది ఎల్లప్పుడూ ఒక పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఇది నిజంగా చాలా కలతపెట్టే విషయం. అసలు మన దగ్గర ఏమి జరుగుతుందో ఊహించలేము.. అని ట్వీట్ చేశారు.

చర్యలు తీసుకోవాలని..

చర్యలు తీసుకోవాలని..

ఇక మరొక ట్వీట్ లో మహేష్ బాబు వీలైనంత త్వరగా ఈ కేసు విషయంలో చర్యలను తీసుకోవాలని చిన్నారికి మరియు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను నేను కోరుతున్నాను! అంటూ.. మహేష్ బాబు వివరణ ఇచ్చారు. ఇక మహేష్ బాబు చేసిన ఆ ట్వీట్ నిమిషాల్లోనే వైరల్ గా మారింది. అభిమానులు కూడా ఆ ట్వీట్ వైరల్ అయ్యేలా చేస్తూ.. నిందితుడి వివరాలను కూడా జత చేస్తున్నారు.

సీరియస్ గా స్పందించడంతో

సీరియస్ గా స్పందించడంతో

సింగరేణి ఘటనపై ఇప్పటికే పోలీసులు తీవ్ర స్థాయిలో విచారణ చేపడుతున్నారు. నిందితుడి కోసం ఘటన జరిగిన మొదటిరోజు నుంచి కూడా రాష్ట్రం నలువైపుల నుంచి జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఒక ప్రత్యేకమైన విభాగం కూడా అతని కోసం సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. మంచు మనోజ్ ఆ అనంతరం మహేష్ బాబు కూడా ఘటనపై సీరియస్ గా స్పందించడంతో విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.

మంచు మనోజ్ కూడా..

మంచు మనోజ్ కూడా..

ఇటీవల బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మంచు మనోజ్ సింగరేణి కాలనీ కి వెళ్లిన విషయం తెలిసిందే. బాధిత తల్లితో కూర్చుని మాట్లాడిన మనోజ్ కంటతడి పెట్టుకున్నాడు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకొని 24 గంటల్లోనే కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా కుటుంబానికి కూడా తాను అండగా ఉంటానని న్యాయం జరిగే వరకూ పోరాడుతూనే ఉంటామని కూడా మనోజ్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X