మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారు చేసిన డైరక్టర్
సైఫ్ అలీ ఖాన్ తో 'గో గోవా గాన్' చిత్రకం రూపొందించిన కృష్ణ డి.కె. - రాజ్ నిడుమోరు దర్శకద్వయం చెప్పిన కథాంశం మహేష్‌కి నచ్చిందని... వారి ప్రతిపాదన మేరకు హిందీలో నటించేందుకు ఒప్పుకొన్నారని తెలిసింది. హిందీ,తెలుగు భాషల్లో తయారయ్యే ఈ చిత్రం ఈ సంవత్సరం ఆఖరుకు మొదలవుతుంది.
దీని గురించి దర్శకుల్లో ఒకరైన రాజ్ మాట్లాడుతూ ''మహేష్‌తో ఓ చిత్రం చేస్తున్నాం. గత ఆరు నెలలుగా చర్చలు సాగుతున్నాయి. ఇది ఏ దక్షిణాది చిత్రానికీ రీమేక్ కాదు''అన్నారు.
మరో దర్శకుడు కృష్ణ డీకె ఈ విషయమై స్పందిస్తూ...'మేము మహేష్ బాబుతో స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనే ప్లాన్లో ఉన్నాం. ఇప్పటికే మహేష్ బాబుకు స్టోరీ కూడా వివరించాం. ఆయన గ్రీన్ సిగ్నల్, డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాము' అని వెల్లడించారు.
ప్రస్తుతం మహేష్ తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఆ తరవాత 'ఆగడు' సినిమా ఉంటుంది. ఆ తరవాతే హిందీ సినిమా ఉండే అవకాశాలున్నాయి. మరి క్రిష్ దర్శకత్వంలో శివం ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications












