'రోబో' శంకర్, మహేష్ కాంబినేషన్...లేటెస్ట్ ఇన్ఫో
"రోబో" తో తిరుగులేని విజయం సాధించిన శంకర్...త్రీ ఇడియట్స్ ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రీమేక్ హీరోగా మహేష్, తమిళంకి విజయ్ ఎంపిక చేసారు. డిసెంబర్ ఆరవ తేదీ నుంచి చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఒకే సారి రెండు భాషల్లోనూ చిత్రం ప్రారంభించి ఏప్రియల్ కి రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంభందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే ప్రారంభమయింది. మరో ప్రక్క రోబో రిలీజైన నాటి నుంచి దర్శకుడు శంకర్ పూర్తి స్ధాయిలో ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ లో పాల్గొంటున్నారు. ఇక మహేష్ ఈ చిత్రం కోసం డిసెంబర్ లో డేట్స్ కేటాయించారని కన్ఫర్మ్ గా తెలిసింది. అలాగే అప్పటికి శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న దూకుడు చిత్రం మొదటి షెడ్యూలు పూర్తవనుంది. ఇక ఈ చిత్రం రెండు వెర్షన్ లోనూ ఇలియానానే హీరోయిన్ గా చేస్తోంది. శర్మాన్ జోషి చేసిన పాత్రను తమిళ హీరో జీవాని ఫైనలైజ్ చేసారు. మాధవన్ చేసిన సెకెండ్ హీరో రోలే ఇంకా ఖాళీగా ఉంది. దానికి ఆర్య, శింబు, సిద్దార్ధలలో ఒకరిని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. హారీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రెండు పాటల రికార్డింగ్ కూడా జరిగింది. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.


Click it and Unblock the Notifications











