Don't Miss!
- News
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కానుక-మన విద్యార్ధులకు 75 స్కాలర్ షిప్ లు ప్రకటించిన బ్రిటన్
- Technology
భారత మార్కెట్లోకి OnePlus Nord 2T 5G విడుదల.. ధర ఎంతంటే!
- Finance
Multibagger Stock: ఇన్వెస్టర్లను ధనవంతులు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. లక్ష పెట్టిన వారికి రూ.5 లక్షలు..
- Automobiles
ఆటమ్ వాడెర్ ఇ-బైక్‌ని లాంచ్ చేసిన హైదరాబాద్ కంపెనీ.. మొదటి 1000 మంది కస్టమర్లకు బంపర్ ఆఫర్!
- Sports
India vs England 5th Test Weather : తొలి రోజు వర్షార్పణమే.. ‘టెస్ట్’ పెట్టనున్న వరుణ దేవుడు..!
- Lifestyle
ఈ 5 రాశుల తండ్రులు వారి పిల్లల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు..అందుకే చెడ్డ నాన్నలు కావచ్చు...
- Travel
సీనియర్ సిటిజన్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
గౌతమ్ పుట్టినప్పుడే ఆ సమస్య.. మాకు డబ్బుంది వాళ్లకు లేదు కదా: బాలయ్య షోలో మహేశ్ ఎమోషనల్
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలంతా ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లు ఇలా ఎన్నో రకాల సాహసాలకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ సైతం ఇటీవలే Unstoppable with NBK అనే ఓ టాక్ షోకు హోస్టుగా పరిచయం అయ్యారు.
ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికి సంబంధించిన చివరి ఎపిసోడ్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు గెస్టుగా వచ్చాడు. ఇందులో అతడు ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని ఎమోషనల్ అంశాలను కూడా మాట్లాడాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

టాక్ షోతో హోస్టుగా బాలకృష్ణ
సుదీర్ఘ కాలంగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఫిదా చేసిన నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు హోస్టుగా మారారు. ‘Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు ఓటీటీ ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని నవంబర్ నెలలో ఈ టాక్ షోను అంగరంగ వైభవంగా మొదలెట్టారు.
Priyanka Chopra: సీక్రెట్‌గా తల్లైన ప్రియాంక చోప్రా.. అందరినీ సర్ప్రైజ్ చేస్తూ సంచలన ప్రకటన

బాలయ్యకు మరో సక్సెస్ కూడా
దాదాపు నాలుగు దశాబ్దాల ప్రయాణంలో బాలకృష్ణ ఏ షోనూ హోస్ట్ చేయలేదు. కానీ, ‘Unstoppable with NBK' షోకు మాత్రం ఆయన అదిరిపోయే హోస్టింగ్ చేస్తున్నారు. తొలి ప్రయత్నమే అయినా వచ్చిన గెస్టులతో పాటు ప్రేక్షకులను అలరిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకూ వచ్చిన ఏడు ఎపిసోడ్స్ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో షో కూడా విజయాన్ని అందుకుంది.

9 ఎపిసోడ్స్.. గెస్టులు ఎవరంటే
బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘Unstoppable with NBK' షో నుంచి ఇప్పటి వరకూ 9 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. దీనికి మోహన్ బాబు ఫ్యామిలీ, హీరో నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, అఖండ మూవీ యూనిట్, రాజమౌళి, కీరవాణి, పుష్ప టీమ్, రవితేజ, గోపీచంద్ మలినేని, దగ్గుబాటి రానా, లైగర్ మూవీ యూనిట్ సభ్యులు గెస్టులుగా వచ్చి తెగ సందడి చేసేశారు.
దారుణమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

మహేశ్ స్పెషల్ ఎపిసోడ్ రెడీ
‘Unstoppable with NBK' టాక్ షోను ఆహా టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే బిగ్ సెలెబ్రిటీలను తీసుకొచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వచ్చే వారం స్ట్రీమింగ్ కాబోతున్న ఎపిసోడ్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు గెస్టుగా వచ్చాడు. అలాగే, దర్శకుడు వంశీ పైడిపల్లిని కూడా తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది.

బాలయ్యతో మహేశ్ హంగామా
మహేశ్ బాబు పాల్గొన్న ‘Unstoppable with NBK' షోలో బాలయ్య తనదైన శైలి హోస్టింగ్‌తో ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా అతడిని ఎలివేట్ చేస్తూ షోలోకి ఆహ్వానించారు. అనంతరం మహేశ్ బాబు ఫ్యామిలీ, పర్సనల్ విషయాలను రాబడుతూ సందడి చేశారు. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఇక, ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది.
నా బాడీలో అవి అంటేనే ఇష్టం: నెటిజన్ వింత ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని జవాబు
మహేశ్ గొప్పదనాన్ని వివరిస్తూ
సూపర్ స్టార్ మహేశ్ బాబు హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్టార్ హీరో వేయి మందికి పైగా చిన్నారుల ప్రాణాలను కాపాడాడు. ఈ విషయాన్ని ‘Unstoppable with NBK' షోలో బాలయ్య వెల్లడించాడు. ఈ క్రమంలోనే కొందరు చిన్న పిల్లలను కూడా షోలోకి తీసుకొచ్చి అతడిని అభినందించారు.

గౌతమ్ పుట్టినప్పుడే ఆ సమస్య
ఈ షోలో మహేశ్ బాబు మాట్లాడుతూ.. ‘గౌతమ్ ఆరు వారాల ముందే పుట్టాడు. అప్పుడు నా చేయి అంతే ఉన్నాడు. మనకి డబ్బుంది కాబట్టి సరిపోయింది. అదే లేనివాళ్లకు ఎలా? అని ఆలోచన వచ్చింది. అప్పటి నుంచే హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నా' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక, ఈ ఎపిసోడ్ ప్రోమోకు భారీ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. దీంతో ఇది ట్రెండ్ అవుతోంది.