'ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడి(పండు)కే మైండ్ బ్లాక్ అయిపోయింది!
ఈ మద్య ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా వుంటోన్న మహేష్ బాబు అభిమానులందరిత తన మనోభావాలను పంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల గురించి ప్రస్తావిస్తూ తన ఫేవరెట్ టీమ్ గా ముంబైని పేర్కొన్నారు. దిగ్రేట్ సచిన్ చేతిలో ఐపీఎల్ కప్ ని చూడాలని వుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసిన మహేష్ మిగిలిన టీమ్ ల అభిమానులు ఫీలవ్వద్దని..తను సచిన్ కి హార్ట్ కోర్ ప్యాన్ ననీ చెప్పారు.
మహేష్ మాత్రమే కాదు..వరుస విజయాలతో ఫైనల్ కి దూసుకువచ్చి అబేద్యంగా కనిపించిన ముంబై జట్టునే అందరూ విజేతగా భావించారు. కానీ మ్యాచ్ ఫిక్సింగే జరిగిందో..మన ధోనీ సుడే తిరిగిందో ఏదో మ్యాజిక్ జరిగి అనూహ్యంగా ఐపీఎల్ కప్ ని చెన్నై ఎగరేసుకుపోయింది. మొత్తానికి 'ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు" అంటూ థియేటర్స్ దద్దరిల్లే లా చేసిన మహేష్ కే మైండ్ బ్లాక్ అయిపోయే రిజల్ట్ ని ఇచ్చింది ఐపీఎల్ ఫైనల్. అఫ్ కోర్స్..మ్యాచ్ కంప్లీట్ అవగానే 'ఇట్స్ ఆల్ ఓవర్ ఫర్ ముండై..అండ్ కంగ్రాట్స్ టు చెన్నై టీమ్" అంటూ ట్విట్టర్ సాక్షిగానే తన స్పిరిట్ ని చాటుకున్నారు మహేష్.


Click it and Unblock the Notifications











