ప్రియమైన భార్యని ముద్దుల్లో ముంచెత్తుతున్న మహేష్.. కారణం అదే!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు సూపర్ పెర్ఫామెన్స్ తో ఈ చిత్రం ఘన విజయం దిశగా సాగుతోంది. తొలి షో నుంచే భరత్ అనే నేను చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీనితో కలెక్షన్ల ప్రభంజనం ఖాయం అని ట్రేడ్ పండితులు అంటున్నారు. మహేష్ బాబుని కొరటాల శివ ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో అద్భుతంగా చూపించారు. మహేష్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజగా మహేష్ బాబు తన సతీమణి నమ్రతని ముద్దుల్లో ముంచెత్తుతున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అది కాస్తా వైరల్ గా మారింది.

మ్యాజిక్ రిపీట్ అయింది
శ్రీమంతుడు చిత్రం మహెష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో దర్శకుడు కొరటాల శివ మ్యాజిక్ మ్యాజిక్ చేశాడు. అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని, భరత్ అనే నేను చిత్రం సూపర్ హిట్ అవుతుందని మహేష్ అభిమానులు భావించారు. అనుకున్నట్లుగానే జరిగింది. భరత్ అనే నేను చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

తొలిసారి మహేష్ బాబు ఆ తరహా పాత్రలో
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి రాజకీయ పరమైన చిత్రాన్ని ఎవరూ ఆశించరు. కానీ కొరటాల శివ ఆ సాహసం చేసి అభిమానులని నిరాశపరచకుండా అన్ని కమర్షియల్ అంశాలని ఈ చిత్రంలో అందించారు.

కలెక్షన్ల సునామి ఖాయం
భరత్ అనే నేను చిత్రం కలెక్షన్ల సునామి ఖాయం అనే అభిప్రాయాలు ట్రేడ్ పండితుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఏ చిత్ర ఓపెనింగ్స్ కూడా నమోదలైనట్లు తెలుస్తోంది.

విజయానందంలో మహేష్
భరత్ అనే నేను చిత్రం మహేష్ బాబు వన్ మాన్ షో అని చెప్పొచ్చు. దర్శకుడు కొరటాల శివ రాసుకున్న కథ ప్రకారం మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. సినిమా విజయం సాధించడంతో మహేష్ సంతోషంలో ఉన్నాడు.

ప్రియమైన శ్రీమతికి
భరత్ అనే నేను చిత్రం అందించిన విజయమో ఏమో తెలియదు కానీ.. ఈ సూపర్ స్టార్ తన సతీమణిని ముద్దుల్లో ముంచెత్తుతున్నాడు. తన భార్య నమ్రతకు మహేష్ ముద్దు ఇస్తున్న ఫోటోని మహేష్ వాయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











