twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దారుణం.. చీకటి రోజు.. ఎన్‌కౌంటర్‌లో సైనికుల మరణం.. మహేష్ బాబు, నితిన్ షాక్

    |

    జమ్ము, కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో శనివారం తెల్లవారు జామున భారత భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవాన్లు మరణించడంపై బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు, క్రికెటర్లు, సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర దిగ్రాంతికి గురయ్యారు. హంద్వారా ఘటనపై టాలీవుడ్‌కు చెందిన మహేష్‌బాబు, నితిన్ తదితర హీరోలు స్పందిస్తూ..

    Recommended Video

    Mahesh Babu & Nithiin Heartfelt Condolences To Handwara Martyr's
    హంద్వారా ఎన్‌కౌంటర్ గురించి నితిన్

    హంద్వారా ఎన్‌కౌంటర్ గురించి నితిన్

    హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. విధి నిర్వహణలోని సైనికులు మరణించారనే వార్త నాకు షాక్‌కు గురిచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్రంగా బాధిస్తున్నది. జవాన్ల ఆత్మకు శాంతి కలుగాలి. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని నితిన్ ట్వీట్ చేశారు.

    మహేష్ బాబు ఆవేదన

    మహేష్ బాబు ఆవేదన

    హంద్వారా దాడి ఘటన దేశ చరిత్రలో చీకటి రోజు. దేశానికి రక్షణ కల్పించడంలో మన సైనికులు ధైర్య సాహసాలు, అంకితభావం అద్భుతం. మన భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సైనికులకు మౌనంగా నివాళి అర్పిస్తున్నాను అని సూపర్‌స్టార్ మహేష్ బాబు అన్నారు. ఈ ఘటనలో ప్రాణ త్యాగం చేసిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

    సైనికుల కథాంశంతో సరిలేరు నీకెవ్వరు

    సైనికుల కథాంశంతో సరిలేరు నీకెవ్వరు

    ఇటీవల సైనికుల వీరత్వాన్ని, త్యాగాలను వెల్లడించే కథాంశంతో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో సైనికుల గొప్పతనాన్ని ప్రేక్షకులకు చాటి చెప్పారు. సినిమా ప్రమోషన్ సందర్భంగా నేరుగా సైనికులతో కలిసి ముచ్చటించారు. సైనికుల కుటుంబాలకు అంకితం చేసేలా తన సందేశాన్ని మహేష్ బాబు వినిపించారు. తాజాగా హంద్వారా ఘటనతో ఆయన తీవ్రంగా దిగ్బ్రాంతికి లోనయ్యారు.

    హంద్వారా ఎన్‌కౌంటర్ గురించి

    హంద్వారా ఎన్‌కౌంటర్ గురించి

    హంద్వారా ఎన్‌కౌంటర్ ఘటనలో ముగ్గురు భద్రతా దళ సిబ్భంది మరణించడం అందర్నీ షాక్ గురిచేస్తున్నది. ఈ ఘటనలో మరణించిన కల్నల్ అషుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్, నాయక్ రాజేష్, లాన్స్ నాయక్ దినేష్ మరణించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో జమ్మ, కశ్మీర్ పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్ సంగీర్ పఠాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో భారత జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారని సైనిక అధికారులు వెల్లడించారు.

    English summary
    Tollywood actors Mahesh Babu, Nithiin Shock over Handwara Encounter. Mahesh Tweeted that, The Handwara attack - A dark time for our nation. Our soldiers' courage and determination to safeguard our nation remains unparalleled. I stand in silence to honour our soldiers who died on duty fighting for us.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X