నాకోసమేనా? క్రౌడ్ చూసి షాకైన మహేష్ బాబు
చెన్నై: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు యూత్‌లో ఎంత ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే మరీ ఎక్కువ. అయతే ఇతర రాష్ట్రాల్లో మహేష్ బాబుకు ట్రెమండస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఇటీవల జరిగిన ఓ సంఘటనతో రుజువైంది.
మహేష్ బాబు నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' షూటింగ్ ఇటీవల రాజమండ్రి సమీపంలో ఔట్ డోర్ షూటింగుకు ప్లాన్ చేసారు. అయితే అక్కడ షూటింగ్ జరిపితే రాజమండ్రి వాసుల వల్ల షూటింగ్ డిస్ట్రబ్ అవుతుందనే ఉద్దేశ్యంతో షూటింగును చెన్నయ్ సమీపంలోని ఓ విలేజ్‌లో ప్లాన్ చేసారు.
అయితే షూటింగ్ విషయం తెలుసుకున్న దాదాపు 1000 మంది ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు ఇంకా చాలా మంది మహేష్ బాబును చూసేందుకు వచ్చారు. మన హీరోకి మన రాష్ట్రంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం సహజమే. తమిళనాట కూడా తనను చూసేందుకు ఇంత మంది రావడంతో మహేష్ బాబు షాకయ్యాడట. వెలుతూ వెలుతూ అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి నిష్కృమించాడు. అదీ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు. మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











