పూణె ప్రక్క వూళ్లో మహేష్ బాబు...
ఈ నెల 15 నుంచి మహారాష్ట్రలోని పుణె సమీపంలోని ఓ గ్రామంలో మహేష్ బాబు కొత్త చిత్రం ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ షూటింగ్ తో టాకీ పూర్తవుతుంది. ఆ తర్వతా మరో నాలుగు పాటల్ని తెరకెక్కించాల్సి ఉంటుంది. మణిశర్మ సంగీత దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్నారు. మహేష్ సరసన అనూష్క హీరోయిన్ గా చేస్తోంది. గతంలో త్రివిక్రమ్, మహేష్ ల కాంబినేషన్ లో వచ్చి హిట్టయిన 'అతడు' ని మించి ఈ చిత్రం వర్కవుట్ అవుతుందంటున్నారు. ఇక నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రం పూర్తి భాధ్యతను తీసుకుని దగ్గరుండి చూస్తున్నారు. నిర్మాత శింగనమల రమేష్ బడ్జెట్ అనుకున్న పరిధి దాటిపోవటం, సినిమా రీ షూటింగ్ జరగటం వంటివి గమనించి ఈ నిర్ణయానికి వచ్చి కళ్యాణ్ కి అప్పచెప్పారు. అలాగే ఇప్పటివరకూ పనిచేసిన కెమెరా మెన్ సునీల్ పటేల్ ని మార్చి యాష్ భట్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. యాష్ భట్ ఇంతకు ముందు రామ్ చరణ్ తేజ, ధోణిలతో కూల్ డ్రింక్ యాడ్ చేసారు. ఇక అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకులతో మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే ఈ చిత్రం అనంతరం శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు చిత్రం ఉంటుంది. సమంతా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











