కెమెరాకు చిక్కిన మహేష్ బాబు, శృతి హాసన్
హైదరాబాద్: మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్. ఇటీవలే ఈచిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పూణెలో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్ ఫోటో ఒకటి బయటకు లీకైంది.
పుణెలో వారం రోజులపాటు కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. అందులో మహేష్ బాబుతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటోంది. 'ఆగడు' పూర్తయ్యాక మహేష్ సెట్‌కు వెళుతోంది ఇప్పుడే. దాంతో అందరి దృష్టీ ఈ చిత్రంపై ఉంది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడని అంటున్నారు.

''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్ శైలికి తగ్గట్టుగా మాస్ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు. సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











