మేనకోడలి హాఫ్ సారీ ఫంక్షన్లో మహేష్ బాబు... (ఫోటోస్)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేకోడలు జాహ్నవి హాఫ్ సారీ ఫంక్షన్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేనకోడలు జాహ్నవి (మంజుల కూతురు) హాఫ్ సారీ ఫంక్షన్లో సందడి చేశారు. మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు అంతా ఈ వేడుకకు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ వేడుక ఎంతో బ్యూటిఫుల్‌గా సాగిందని మంజుల తెలిపారు.
తన కూతురు హాఫ్ సారీ ఫంక్షన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా మంజుల అభిమానులతో పంచుకున్నారు. ఆఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

మేన కోడలితో మహేష్ బాబు
మేనకోడలు జాహ్నవి హాఫ్ సారీ ఫంక్షన్లో మహేష్ బాబు, నమ్రత, గౌతమ్ మరియు మంజుల, సంజయ్ స్వరూప్.

మనవరాలితో కలిసి కృష్ణ
తన మనవరాలు జాహ్నవికి సారీ బహూకరిస్తున్న నటుడు కృష్ణ.

అచ్చం అమ్మ పోలికే
మంజుల కూతురు జాహ్నవిని చూసిన వారంతా అచ్చం అమ్మ పోలికే అని అంటున్నారు.

మంజుల
అందంగా అలకరించబడిన తన కూతురు హాఫ్ సారీ ఫంక్షన్ వేదిక వద్ద మంజుల.


Click it and Unblock the Notifications











