టాలీవుడ్‌కి మరో సూపర్ వారసురాలు: హీరోయిన్ అవుతున్న మహేష్ మేనకోడలు?
సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల మాత్రం ఎందుకనో కెరీర్‌లో రాణించలేకపోయింది. ఎలాగైనా తన కూతురు జాన్విని హీరోయిన్ గా చూడాలని ఇప్పటి నుండే వెండితెరను పరిచయం చేయిస్తోంది.
Recommended Video

సినిమాల్లోకి స్టార్ల వారసులు వరదల్లా వెల్లువెత్తుతున్న వేళ సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల మాత్రం ఎందుకనో కెరీర్‌లో రాణించలేకపోయింది. నీలకంఠ షో ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో మెరిసింది తప్ప పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. హీరోయిన్ అవ్వాలన్న కోరిక నెరవేర్చుకోలేక పోయిన మంజుల ఇప్పుడు కూతురి ద్వారా నెరవేర్చుకోనుందట.

ఫెయిల్ అయ్యాను
మొదటినుండీ నటించాలనే అనుకున్నాను. కాని కుదర్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అయ్యాను. నేను నటించి ఫెయిల్ అవ్వడం వేరు. కాని అసలు నాకు అవకాశమే రాలేదు. దీనంతటికి కారణం మా ఫ్యామిలీ.. ఫ్యాన్స్ అనిపించింది.(అప్పట్లో కృష్ణ అభిమానులే ఆమెను హీరోయిన్ కాకుండా అడ్డుకున్నారనే టాక్ వినిపించింది).

బాధ్యురాలిని నేనే
ఆలోచిస్తే దీనంతటికీ బాధ్యురాలిని నేనేనని ఇప్పుడు అర్థమౌతోంది. సమాజం కోసం కాదు నా కోసం నేను ఆలోచించటం మొదలుపెట్టా" అంటూ చెప్పిన మంజుల. మొదట్లో హీరోయిన్ అవటానికి చాలా ప్రయత్నాలు కూడా చేసిందట. కానీ వర్కవుట్ కాలేదు. ఆమె హీరోయిన్ కావడానికి వీల్లేదని ఫ్యాన్స్ గొడవపెట్టారు.

బాలయ్యతో సినిమా
అందుకే బాలయ్యతో సినిమా మొదలై ఆగిపోయింది. ఆ తరువాత కొన్నేళ్ళకు నటిగా కొన్ని సినిమాల్లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంజుల. చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ లో మంజులని గుర్తుపట్టే వారు చాలా మంది ఉన్నారు.

కూతురు జాన్విని హీరోయిన్ గా
అయితే హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయాను అనే బాధను కొంతలో కొంత అయినా తీర్చుకోవడానికి ఆమె తన కూతురుని రంగుల ప్రపంచంలోకి దింపనుందట. ఎలాగైనా తన కూతురు జాన్విని హీరోయిన్ గా చూడాలని ఇప్పటి నుండే వెండితెరను పరిచయం చేయిస్తోంది.

సందీప్ కిషన్ హీరోగా
ప్రస్తుతం ఆమె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక లవ్ స్టోరీలో ఒక మంచి క్యారెక్టర్ ని చేయించనున్నారట మంజుల. ఆ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్ గా షూటింగ్ స్పాట్ లో సందీప్ పక్కనే కనిపించి ఇంప్రెస్ చేస్తోంది. ''తనను ఎప్పుడే షూట్ లోకి రానివ్వలేదు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా
అందుకే మొదటి సారి తను షూటింగ్ లోకి రాగానే నర్వస్ గా అనిపించింది. కానీ మొదటి సీన్ షూట్ చేసిన తర్వాత తనపై నాకు నమ్మకం పెరిగింది. తను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పటి మహేష్ ను గుర్తు చేస్తోంది'' అంటూ చెప్పింది మంజుల. ఈ సినిమా తరువాత మహేష్ మేనకోడలు మరి హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తుందా? వెయిట్ అండ్ సి.


Click it and Unblock the Notifications











