మహిళలపై రేప్‌లు : మహేష్ బాబు సోషల్ రెస్పాన్సబులిటీ
హైదరాబాద్ : దేశంలో రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, హింసాత్మక సంఘటలను పెరిగి పోతున్న సంగతి తెలిసిందే. వీటిని అరికట్టేందుకు, సమాజంలో చైతన్యం తెచ్చేందుకు నిర్వహించే కార్యక్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాలు పంచుకోనున్నాడు.
బాలీవుడ్ దర్శకుడు ఫరాన్ అక్తర్ ఇలాంటి సంఘటనలను అరికట్టేందుకు 'MARD'(మెన్ అగెనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్) పేరుతో అవేర్‌నెస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌ను మెయిన్ ఫేస్‌గా ఎంపిక చేసారు. ఇందులో మహేష్ బాబు కూడా జాయిన్ కాబోతున్నాడు.
దేశంలోని వివిధ భాషల్లో ఈ ప్రచారం జరుగనుంది. తెలుగు కాంపెయిన్‌కు మహేష్ బాబు వాయిస్ ఇవ్వబోతున్నారు. 'ఇలాంటి కార్యక్రమానికి మహేష్ బాబు అయితేనే మంచి ప్రభావం కనిపిస్తుంది, అతని కోసం ఎదురు చూస్తున్నాం' అని ఫరాన్ అక్తర్ సన్నిహితులు వెల్లడించారు.
సినీతారలకు సోషల్ రెస్ఫాన్సబులిటీ లేదని విమర్శస్తున్న వాళ్ల నోటికి మహేష్ బాబు లాంటి వాళ్ల ప్రచారంతో తాళం పడనుంది. మహేష్ బాబు స్పూర్తితో మరింత మంది హీరోలు కూడా ఇకపై ఇలాంటి సమాజసేవ కార్యక్రమాల్లో తమ వంతు బాధ్యతగా పాలుపంచుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












