SSMB28: మహేష్ బాబుకు మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. వాటా లేకుండా సింగిల్ పేమెంట్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నీ ఫినిష్ కావడంతో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. గత ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. కానీ మహేష్ బాబు బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయ్యే వరకు కూడా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఒప్పుకోలేదు.
దీంతో సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి మరికొంత ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక మొత్తానికి రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెలలో మొదలుపెట్టి ఈ ఏడాది చివరిలో పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇక వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు భారీ స్థాయిలో పారితోషికం కూడా అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబుకు దాదాపు 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారట. అయితే మహేష్ బాబు మార్కెట్ పెరిగిన తర్వాత చాలా వరకు తన ప్రతి సినిమాకు లాభాల్లో వాటా కూడా అందుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా తన GMB ప్రొడక్షన్స్ ను కూడా ప్రతి సినిమాకు కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ క్రమంలో మహేష్ బాబు ఈసారి అలాంటి ప్లాన్ తో కాకుండా నిర్మాతల నుంచి ఒకేసారి అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
హారిక హాసిని SSMB 28 ప్రాజెక్ట్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఈ సినిమాకు 200 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం. ఇక బిజినెస్ అయితే దాదాపు 300 కోట్ల వరకు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎలా చూసుకున్న కూడా నిర్మాతలకు ఈ సినిమా ద్వారా విడుదలకు ముందే 50 కోట్ల ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి సినిమా మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











