మహేష్ బాబు తనయుడిని విష్ చేయండి (ఫోటోలు)
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ పుట్టినరోజు వేడుక నిన్న జరిగింది. మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ దంపతులకు ఆగస్టు 31, 2006న గౌతం కృష్ణ జన్మించాడు. మమేష్ బాబు నటించిన '1(నేనొక్కడినే)' చిత్రం ద్వారా గౌతం కృష్ణ తెరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. దీంతో గౌతం పుట్టిన రోజు వేడుకలను కూడా మహేష్ బాబు అభిమానులు చేయడం మొదలు పెట్టారు.
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు సినిమారంగంలోకి ప్రవేశిస్తే....మహేష్ బాబు నట వారసుడిగా గౌతం కృష్ణ తెరంగ్రేటం చేసారు. మహేష్ బాబు తన తండ్రి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసినట్లే, గౌతం కూడా తన తండ్రి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా వెండి తెరకు పరిచయం కావడం గమనార్హం.
ఇప్పటి నుండే గౌతం సినిమా కెరీర్‌కు బాటలు వేయడం ద్వారా భవిష్యత్‌లో మంచి నటుడిగా ఎదుగుతాడు అనేది మహేష్-నమ్రత దంపతుల ఆలోచనగా కనిపిస్తోంది....

మహేష్ బాబు ఫ్యామిలీ
మహేష్ బాబుది ముచ్చటైన ఫ్యామిలీ. తన సహచర నటి నమ్రతను మహేష్ బాబు ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి గౌతం, సితార పిల్లలు జన్మించారు.

గౌతం తెరంగ్రేటం
మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘1'(నేనొక్కడినే) చిత్రం ద్వారా మహేష్ వారసుడు గౌతం కృష్ణ బాలనటుడుగా వెండితెర తెరంగ్రేటం చేసారు.

బుల్లి మహేష్ బాబు పాత్రలో గౌతం
ఈ చిత్రంలో గౌతం కృష్ణ...సినిమాలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రను పోషించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన సీన్లులో గౌతం ఎంతో అద్భుతంగా నటించాడు.

మహేష్ బాబు నటవారసత్వం
సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వంగా మహేష్ బాబు చిన్న తనంలోనే బాల నటుడిగా వెండి తెర తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. అదే బాటలో గౌతం మహేష్ బాబు నట వారసుడిగా వెండితెరంగ్రేటం చేసాడు. మహేష్ బాబు తనయుడు గౌతం మహేష్ బాబు పోలికలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.

మహేష్ కూతురు సితార
మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్ దంపతులకు జులై 20, 2012న సితార జన్మించింది. సితారను తమ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తున్నారు మహేష్ కుటుంబ సభ్యులు.


Click it and Unblock the Notifications











