Don't Miss!
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
‘అమ్మా లేదు..నాన్నా లేడు’ అంటున్న మహేష్ బాబు కొడుకు
నా సినిమాల్లోని డైలాగులు, పాటలు గౌతమ్‌కు కంఠతా వచ్చు. ముఖ్యంగా 'పోకిరి" చిత్రంలోని డైలాగులు అస్తమానం చెబుతుం టాడు.ఇక 'ఏక్‌నిరంజన్"లోని 'అమ్మా లేదు..నాన్నా లేడు" పాట కూడా ఎప్పుడూ పాడుతుంటాడు అంటున్నారు మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ గురించి చెప్తూ ఇలా స్పందించాడు.మహేష్‌బాబు ముద్దుల తనయుడు గౌతమ్ కృష్ణ జన్మదిన వేడుకలు నిన్న (ఆగస్టు 31) గోవాలోని ఓ అయిదు నక్షత్రాల హోటల్లో జరిగాయి. మహేష్ బాబు-నమ్రత, మంజుల-సంజయ్ స్వరూప్ లు ఈ వేడుకలో ప్రత్యక్షంగా పాల్గొనగా, తాత సూపర్‌స్టార్ కృష్ణ సహా మిగతా కుటుంబ సభ్యులంతా ఫోనులోనే గౌతమ్‌కు పుట్టినరోజు శుభాశీస్సులు అందించారు. అలాగే గౌతమ్ గురించి మహేష్ ఇంకా చెప్తూ..ఇక నేను ఇంట్లో ఉన్నంతసేపు గౌతమ్ తో ఆడుకుంటూ, వాడు చేసే అల్లరిని ఆస్వాదిస్తూ ఉంటాను. తను ప్రస్తుతం బుద్ధిగా స్కూల్‌కు వెళుతూ, ఇంట్లో అల్లరి పనులు చేస్తూ ఉన్నాడు. నేను కూడా చిన్నప్పుడు నాన్నగారి సినిమాల్లో డైలాగులు వల్లె వేస్తూ, నాన్నగారిని అనుకరిస్తూ ఉండేవాడిని. అదే క్రమంగా ఆసక్తిగా మారిపోయింది అంటూ మురిసిపోతూచెప్తున్నాడు.