twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ కొడుకు తో పవన్ కల్యాణ్ ఇలా..(ఫోటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణని ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ ఫోటో చూసారా....ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఇది హాట్ గా మారింది. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ చిత్రానికి మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది. మహేష్ వాయిస్ ఓవర్ చెప్తూంటే..పవన్ ఆయన కొడుకుతో ఇలా ఆడుకుని కెమెరాకి చిక్కారు.

    పవన్,త్రివిక్రమ్ చిత్రం విషయానికి వస్తే...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రం యూరప్ షెడ్యూల్ ఖరారైంది. జూన్ మొదటి వారంలో అక్కడ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మొత్తం 25 రోజుల పాటు వివిధ లోకేషన్లలో షూటింగ్ జరుపాలని నిర్ణయించారు.

    ఈ మేరకు యూరప్ లోని లొకేషన్ల గురించి ఆరా తీస్తున్నారు. రొటీన్ లొకేషన్లు కాకుండా సరికొత్త లొకోషన్లపై దృష్టి సారించారు. ఇక్కడ కొన్ని సీన్లను చాలా స్టైలిష్‌గా, గ్రాండ్‌గా పిక్చరైజ్ చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో షూటింగ్ డేట్ ఖరారు చేయనున్నారు.

    ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. మే 3తో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    మొత్తం 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'

    English summary
    This pic was taken when Mahesh was giving voiceover to Pawan-Trivikram for their untitled film. When Mahesh was lending his voice, Pawan had a little play time with Goutham.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X