నాన్న అప్పుడు పిల్లాడిలా మారిపోతాడు: మహేష్ బాబు
హైదరాబాద్: 'నా సినిమాల పొగ్రెస్ గురించి నాన్న(కృష్ణ) ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు, హిట్టయితే ఆయన ఫేసులో ఆనందం కనిపిస్తుంది. ఒక్కోసారి ఆ సందర్భంలో ఆయన్ను చూస్తే 10, 15 ఏళ్ల పిల్లాడిలా మారిపోయారు అనిపిస్తుంది' అని మహేష్ బాబు ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా క్లోజ్‌గా ఉంటామని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. అయితే అన్నయ్య రమేష్ బాబు దగ్గర మాత్రం తనకు చనువు ఎక్కువని, నాన్న సినిమా షూటింగుల్లో బిజీగా గడిపే రోజుల్లో అన్నయ్య రమేష్ బాబు మా గురించి కేర్ తీసుకునే వారు అని మహేష్ బాబు తెలిపారు. హీరోగా ఎంట్రీ కాకముందు మహేష్ బాబు బాల నటుడిగా తండ్రి కృష్ణ, అన్నయ్య రమేష్ బాబుతో కలిసి పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

త్వరలో మహేష్ బాబు నటించిన '1-నేనొక్కడినే' చిత్రం విడుదల అవుతోంది. ఈ చిత్రంతో మహేష్ బాబు కుమారుడు గౌతం బాల నటుడిగా తెరంగ్రేటం చేస్తుండటం మరో విశేషం. గౌతంను నటింపచేయడానికి ముందు దర్శకుడు సుకుమార్, అసిస్టెంట్ డైరెక్టర్లు మా ఇంటికి వచ్చి గౌతంతో ఆడుకునే వారు. గౌతంతో చనువు పెంచుకుంటే ఈజీగా నటింపచేయవచ్చనే ఆలోచనలో వారు ఇలా చేసారు. సుకుమార్ కోరుకున్న విధంగా గౌతం నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోగలిగారని మహేష్ బాబు తెలిపారు.
'1-నేనొక్కడినే' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ వారే నిర్మిస్తుండటం విశేషం. తమన్నా హీరోయిన్.


Click it and Unblock the Notifications











