»   » పేజ్-3 పార్టీలపై మహేష్ బాబు స్పందన ఇలా...!

పేజ్-3 పార్టీలపై మహేష్ బాబు స్పందన ఇలా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య నగరాల్లో పేజ్ -3 కల్చర్ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు పేజ్-3 పార్టీల్లో ఎక్కవగా దర్శనం ఇస్తుండటంతో యువత కూడా ఇటు వైపు ఆకర్షితులు అవుతున్నారు. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం.

ఉంటే షూటింగులో, లేకుంటే ఇంట్లో....తప్ప మహేష్ బాబు బయట కనిపించే సందర్భాలు చాలా తక్కువ. ఇక పేజ్-3 పార్టీలకు, అలాంటి తరహా కార్యక్రమాలకు మహేష్ బాబు వీలైనంత దూరంగా ఉండటమే ఆయనకు అలవాటు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఇలాంటి విషయాలపై స్పందించారు.

'చిన్నతనం నుండే నాకు పార్టీలకు వెళ్లే అలవాటు లేదు. పెళ్లి తర్వాత ఫ్యామిలీకి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పేజ్-3 పార్టీలను నేను అస్సలు ఖాతారు చేయను. సినిమా రంగానికి, ఇతర రంగాలకు చెందిన పేజ్-3 కార్యక్రమాలకు తప్పకుండా హాజరు కావాలనే ఆసక్తి కూడా ఉండదు. ఇల్లు, పిల్లలకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను' అని మహేష్ బాబు వెల్లడించారు.

Mahesh Babu

ప్రస్తుతం మహేష్ బాబు నటించిన '1-నేనొక్కడినే' చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా మహేష్ తనయుడు గౌతం కృష్ణ బాలనటుడిగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రం చేస్తున్నాడు.

English summary
"From my childhood, I am like this. I never go parties and attend functions. Even after marriage, our home is important for us. We don’t give importance to Page 3 or to appear at all the events. Our focus is on our kids and our home. From the beginning we were like this, even when our father was a big star we would hardly go out, most of the time we stayed at home and spent time with the family," Mahesh told to DC.
 
 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X