Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Happy Birthday Prabhas: ప్రభాస్ కు మహేష్ బాబు స్పెషల్ బర్త్ డే విషెస్.. ఒకప్పటి ఫొటో షేర్ చేస్తూ..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేడు 42 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా స్టార్ సెలబ్రిటీలు అందరూ కూడా ఎంతో సంతోషంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖులే కాకుండా తమిళ్ హిందీ చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఎంతో మంది స్టార్ సెలబ్రెటీలు దర్శకులు నిర్మాతలు ప్రతి ఒక్కరు కూడా డార్లింగ్ అంటూ స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక ప్రత్యేకమైన ఫోటో షేర్ చేస్తూ రెబల్ స్టార్ కు తనదైన శైలిలో ప్రత్యేకంగా విషెస్ అందించారు.
ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నా కూడా..
రెబల్ స్టార్ ప్రభాస్ మహేష్ బాబు ఇద్దరూ కూడా ఎక్కువగా బయట ప్రపంచానికి కలిసి కనిపించకపోయినప్పటికీ చాలా సన్నిహితంగా ఉంటారు. సినిమా ఈవెంట్స్ లో కలిసినప్పుడు కూడా ఇద్దరు హీరోలు చాలా ఫ్రెండ్లీ గా కనిపిస్తూ ఉంటారు. ప్రభాస్ మహేష్ ఇద్దరూ కూడా చాలాసార్లు ఒకే ఫ్రేమ్‌లో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నా కూడా ఇద్దరు స్టార్ హీరోలు కూడా అరగంటసేపు సినిమా విశేషాల గురించి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారని కూడా తెలుస్తోంది.
అప్పట్లో వర్షం సినిమా కోసం
మహేష్ బాబు ప్రభాస్ ఇద్దరు కూడా ప్రైవసీ లైఫ్ ను కాస్త ఎక్కువగానే ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా బయట ప్రపంచం లోకి వెళ్లకుండా వీలైనంతవరకు వారి సన్నిహితులతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇద్దరూ కాస్త సిగ్గుపడుతూ కనిపిస్తూ ఉంటారు. చాలా కూల్ గా కనిపించే ఈ హీరోలు గతంలో కొన్నిసార్లు సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ లలో కూడా పాల్గొన్నారు. ఇక అప్పట్లో వర్షం సినిమా ఆడియో వేడుకలో కూడా మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా వచ్చాడు.
మహేష్ స్పెషల్ విషెస్
మహేష్ బాబు ప్రభాస్ ఇద్దరు కూడా చాలా నెమ్మదిగా వారి స్టార్ హోదా ను పెంచుకుంటూ వచ్చారు. ఈ కలయికలో ఒక సినిమా వస్తే చూడాలని ఉందని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో స్టార్స్ ఎవరైనా సరే తనకి నచ్చితే మహేష్ బాబు స్పెషల్ గా బర్త్ డే విషెస్ కూడా అందిస్తూ ఉంటారని అందరికీ తెలిసిందే.. ప్రభాస్ కు కూడా మహేష్ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అంటూ.. మీకు ఇది కూడా అద్భుతమైన సంవత్సరం అవ్వాలమి కోరుకుంటున్నట్లు మహేష్ పేర్కొన్నారు.
అభిమానుల కోరిక..
అంతేకాకుండా మహేష్ గతంలో ప్రభాస్ తో నవ్వుతూ దిగిన ఒక ఫోటోను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. దీంతో అభిమానులు కూడా ఆ ఫోటో ను సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. వీరి కలయికలో ఒక సినిమా వస్తే కూడా బాగుంటుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు ఇక మరోవైపు ప్రభాస్ వరుసగా నాలుగు పాన్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.