మరోసారి హాలీడే ట్రిప్ లో మహేష్ బాబు.. ఇంత సడన్ గా ఎందుకంటే..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హాలిడే ట్రిప్స్ కు వెళ్లే హీరోలలో మహేష్ బాబు ఒకరు. ఆయన ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా ఫ్యామిలీతో కలిసి సరదాగా విదేశాలకు వెళుతూ కొన్ని రోజులపాటు అక్కడే హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఏడాది మొదట్లోనే కాకుండా సమ్మర్లో అలాగే ఏడాది చివర క్రిస్మస్ సందర్భంగా కూడా వీరు హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడైనా మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నప్పుడు కాస్త రెస్ట్ కావాల్సి వస్తే ప్రత్యేకంగా కూడా కొన్ని హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు.
ఇక ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నా కూడా వీలైనంతవరకు విదేశాల్లోనే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ బాబు స్పెయిన్ లో పది రోజులపాటు ఉండేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు మాత్రమే కాకుండా అతని భార్య కూడా స్పెయిన్ వెళుతున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మహేష్ బాబు నమ్రత కనిపించడంతో మీడియా ఫోకస్ చేసింది.
దీంతో అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇప్పుడు ఇంత సడన్ గా ఎందుకు వెళ్తున్నారు అంటే ఫిబ్రవరి 10వ తేదీన నమ్రత మహేష్ బాబు మ్యారేజ్ యానివర్సరీ. అందుకే ప్రత్యేకంగా వాలెంటైన్స్ డే కూడా ఉండడంతో మరో 10 రోజుల పాటు స్పెయిన్ లోనే ఉండబోతున్నారు. మహేష్ నమ్రతను లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న 28వ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. కానీ మహేష్ బాబు ఆ షెడ్యూల్ కు అవసరం లేదు. ఇక మహేష్ బాబుతో మరొక కీలకమైన షెడ్యూల్ ను ఫిబ్రవరి 20 తర్వాత మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలి అని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమాతో చాలా బిజీగా మారబోతున్నాడు. ఆ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది.


Click it and Unblock the Notifications











