twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉగాది పర్వదినాన మహేష్ సూత్రాలు.. ఆరు నియమాలు పాటించండని ట్వీట్

    |

    కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా గడగడలాడి పోతోంది. ఇప్పటికే ప్రపంచదేశాలు షట్ డౌన్ అయ్యాయి. మన దేశం కూడా రానున్న 21 రోజులు షట్ డౌన్ అవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చర్యతో రోడ్లపైకి వచ్చిన వారికి కఠిన శిక్షలు అమలు చేయబడతాయని తెలిపాడు. ఈ షట్ డౌన్‌కు సెలెబ్రిటీల నుంచి మద్దతు లభిస్తోంది.

    కరోనా వైరస్‌పై అవగాహన కలిగించేందుకు సెలెబ్రిటీలు ముందగుడు వేశారు. వీడియో సందేశాల ద్వారా అభిమానులకు తెలియజెప్పారు. ప్రధాని విధించిన జనతా కర్ఫ్యూకు, 21 రోజుల పాటు ప్రకటించిన లాక్ డౌన్ నిర్ణయానికి సినీ తారలంతా మద్దతు తెలిపారు.

    తాజాగా మహేష్.

    తాజాగా మహేష్.

    ఉగాది పర్వదినాన మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. అందరికీ ఆరు సూత్రాలను వివరించాడు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అందరికీ సూచించాడు. కరోనాకు వ్యతిరేకంగా పోరాడాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరాడు. ఇంతకీ మహేష్ చెప్పిన ఆ ఆరు నియమాలేంటో ఓ సారి చూద్దాం.

    ఆరు నియమాలు పాటించండి..

    ఆరు నియమాలు పాటించండి..

    అందరికీ ఉగాది శుభాకాంక్షలు.. ఇలాంటి విపరీత పరిస్థితుల్లో కరోనాకు వ్యతిరేకంగా పోరాడటం గురించి మీ అందరికీ ఈ 6 విలువైన నియమాలను పాటించమని కోరుతున్నాను. మొదటిది, అతి ముఖ్యమైనది ఇంట్లోనే ఉండండి. ఏదో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. రెండోది, ఏదైనా తాకితే కనీసం 20/30 సెకన్లు మీ చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవాలని గుర్తుంచుకోండి.

    సామాజిక దూరం అవసరం.

    సామాజిక దూరం అవసరం.

    మూడోది.. మీ ముఖాన్ని, ముఖ్యంగా కళ్ళు, నోరు మరియు ముక్కును తాకకుండా ఉండండి. మీ నోటిని, ముఖాన్ని, ముక్కుని తాకవద్దు. నాల్గోది... దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు మీ మోచేతులు లేదా టిష్యూ వాడండి. ఐదోది.. సామాజిక దూరపు అవసరాన్ని అర్థం చేసుకుని, మీ ఇంటి లోపల లేదా బయట ఇతర వ్యక్తుల నుండి కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి.

    Recommended Video

    Vijay Devarakonda Tops Most Desirable Man 2019 | Ram Charan | Prabhas
    ఇంట్లోనే ఉండండి..

    ఇంట్లోనే ఉండండి..

    ఇక చివరగా.. మీకు కరోనా లక్షణాలు లేదా అనారోగ్యం ఉన్నట్లయితే మాత్రమే మాస్క్'ని వాడండి. మీకు COVID-19 లక్షణాలు ఉంటే దయచేసి డాక్టర్ని లేదా క్లినిక్‌ని సంప్రదించండ'ని తెలిపాడు. సరైన వనరుల నుండి మంచి సమాచారం మరియు నమ్మకమైన సమాచారాన్ని కలిగి ఉండండి. ప్రార్ధిద్దాం, మంచిని ఆశిద్దాం మరియు కలసికట్టుగా ఈ యుద్దాన్ని గెలుద్దాం ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండని కోరాడు.

    English summary
    Mahesh Babu Special tweet On Ugadi And Coronavirus. He Suggested Six Points To Everyone To fight With Corona virus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X