ఆ టెన్షన్ తట్టుకోలేక ఫ్యామిలీతో ఎక్కడికో వెళ్లిపోయా : భరత్ సక్సెస్ మీట్లో మహేష్ బాబు
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరరెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం భారీ విజయం సాధించడం, రెండు రోజుల్లోనే 100 కోట్లకుపైగా వసూలు చేయడంతో చిత్ర బృందం సోమవారం సాయంత్రం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మహేష్ బాబుతో పాటు దర్శకుడు కొరటాల శివ, నిర్మాత దానయ్య, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటుడు బ్రహ్మాజీ, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రెండేళ్లుగా ఒత్తిడిలో ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమాకు కష్టపడినంతగా ఏ సినిమాకు కష్టపడలేదని, పని టెన్షన్ తట్టుకోలేక పోయానని మహేష్ వెల్లడించారు.

సినిమా విజయంతో రెండేళ్ల ఒత్తిడి తగ్గింది
మా సినిమాకు ఇంత పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు థాంక్స్. నేనెప్పుడూ చెప్పలేదు గత రెండేళ్లుగా నాకు ఎమోషనల్‌గా ఏదో డ్రై ఫీలింగ్ ఉండేది, చాలా స్ట్రెస్‌ఫుల్ పీరియడ్ అది. ఇపుడు చాలా సంతోషంగా ఉంది. అది ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. సినిమా విజయంతో ఒక రిలీఫ్ వచ్చినట్లయింది అని.... మహేష్ బాబు తెలిపారు.

నా టెన్షన్ అర్థం చేసుకుని మరో హిట్ ఇచ్చాడు, శివకు రుణపడి ఉంటా
శివ గారి గురించి చెప్పాలంటే ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. శ్రీమంతుడు ముందు కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది. అపుడు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇపుడు మళ్లీ అదే రిపీట్ చేశారు. నేను పడుతున్న టెన్షన్ పైకి కనిపిస్తోంది. హీరో అలా టెన్షన్ పడుతున్నాడంటే అది చూపించకుండా మళ్లీ ఇంకో బ్లాస్టర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం శివ వల్లు సాధ్యమైందని మహేష్ వ్యాఖ్యానించారు.

తెలుగు సినిమాకు ఇంకో పెద్ద హీరోయిన్ దొరికింది
బ్రహ్మాజీ నాతో నటించిన సినిమాల్లో 99 శాతం బ్లాక్ బస్టర్ అయ్యాయి. కియారాతో పని చేయడం అమేజింగ్, తెలుగు సినిమాకు ఇంకో పెద్ద హీరోయిన్ వచ్చిందని ఆనందంగా ఉంది... అని మహేష్ బాబు అన్నారు.

టెన్షన్ తట్టుకోలేకే ఫ్యామిలీతో ఎక్కడికో వెళ్లిపోయా
నేనెప్పుడూ ఇంత కష్టపడి ఒక సినిమాకు పని చేయలేదు. మా సినిమా రిలీజ్ ఒక వారం ముందుకు జరిగింది. ఏప్రిల్ 27 అనుకున్నాం, కానీ ఏప్రిల్ 20కి వచ్చాము. అది అమ్మగారి పుట్టినరోజు. ఆ రోజు రిలీజ్ అవ్వడం వల్లే ఈ బ్లెస్సింగ్స్ వచ్చాయేమో? ఆ టెన్షన్లో 50 రోజుల నుండి షూటింగ్ జరుగుతూనే ఉంది. డే షూటింగ్ చేసి ఈ వినింగ్ డబ్బింగ్ చెప్పి, మళ్లీ స్పెయిన్ వెళ్లి పాట చేసి, ప్రి రిలీజ్ ఈ వెంట్ చేసి మళ్లీ సెకండాఫ్ డబ్బింగ్ చెప్పాను. 20వ తేదీ సినిమా రిలీజ్ అయితే 10వ తేదీ నా డబ్బింగ్ కంప్లీట్ అయింది. నాకేమీ అర్థం కాలేదు. ఈ టెన్షన్ తట్టుకోలేక ఒక ఐదు రోజులు ఫ్యామిలీతో ఎక్కడికో వెళ్లాను(పారిస్ టూర్)... అని మహేష్ బాబు తెలిపారు.

బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో దేవి ఒక స్టోరీ టెల్లర్
అక్కడికి వెళ్లినా ప్రతి గంట శివ గారికి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఆయన పోస్టు ప్రొడక్షన్ టెన్షన్లో ఉన్నారని తెలుసు. ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు. దేవికి ఫోన్ చేసినపుడల్లా ఒక ఆనందం. అతడి పాజిటివ్ ఎనర్జీ గురించి ఎలా చెప్పాలే తెలియడం లేదు. అతడితో మాట్లాడినపుడు పాజిటివ్ ఫీలింగ్ వచ్చేది. మొన్న మా ఇంట్లో సినిమా చూసిన తర్వాత వెంటనే దేవికి చెప్పాను. పాటల గురించి ముందే చెప్పాను ఎక్స్ ట్రార్డినరీగా చేశాడని, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో దేవి ఈజ్ ది స్టోరీ టెల్లర్...నాట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్.
రామ్ జో... యూ ఆర్ రాక్డ్ ఇట్ బ్రో
లిరిక్స్ గురించి గతంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే చెప్పాను, నా సినిమాల్లోనే ది బెస్ట్ లిరిక్స్. ‘రామ్ జో... యూ ఆర్ రాక్డ్ ఇట్ బ్రో' అంటూ మహేష్ బాబు వ్యాఖ్యానించారు. మహేష్ అలా అనడంతో రామజోగయ్య సిగ్గు మొగ్గలేశారు, సక్సెస్ మీట్లో నవ్వులు పూశాయి.


Click it and Unblock the Notifications











