twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మే 31 వరకు కలెక్షన్స్ ఇలానే చెబుతూ ఉండాలి: మహేష్ బాబు బ్లాక్ బస్టర్ స్పీచ్

    By Bojja Kumar
    |

    మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం తొలి వారం రూ. 161 కోట్లకుపైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నోవాటెల్‌లో బ్లాక్ బస్టర్ భారీ వేడక నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు స్పీచ్ అదరగొట్టారు. 10 రోజుల నుండి నాన్ స్టాప్‌గా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాను. విజయవాడ, తిరుపతి వెళ్లాను. రిలీజైన తర్వాత శివగారు నన్ను పడుకోనీయకుండా చేస్తున్నారు. కానీ ఇలాంటి రోజులు ఇలానే ఉండాలిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా చేసి చాలా రోజులైందని మహేష్ బాబు తెలిపారు.

    చాలా గర్వంగా అనిపించింది

    చాలా గర్వంగా అనిపించింది

    అందరికీ షీల్డ్స్ ఇవ్వడం నాకు బాగా నచ్చింది. ఇలా చేసి చాలా రోజులైంది. నిజంగా బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చిన యాక్టర్లందరికీ థాంక్స్. షూటింగ్ సమయంలో అసెంబ్లీ సీన్లో చాలా మంది సీనియర్ యాక్టర్లతో చేశాను. శివగారు సెట్ కి రాగానే పది పేజీల డైలాగ్ ఇచ్చేశారు. ఫస్ట్ షాట్ చేసేపుడు చాలా టెన్షన్ అనిపించింది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంత మంది సీనియర్ల ముందు అలా పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు చాలా గర్వంగా అనిపించింది. ఈ సినిమా కోసం ప్రతి డిపార్ట్‌మెంట్ చాలా కష్టపడి పని చేశారు. అందరికీ థాంక్స్.... అని మహేష్ బాబు తెలిపారు.

    మే 31 వరకు షేర్స్ ఇలానే చెబుతూ ఉండాలి

    మే 31 వరకు షేర్స్ ఇలానే చెబుతూ ఉండాలి

    డిస్ట్రిబూటర్స్ అందరినీ ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది. అమ్మగారి పుట్టినరోజు ఏప్రిల్ 20న సినిమా విడుదలైంది. నాన్నగారి పుట్టినరోజు మే 31 వరకు షేర్స్ ఇలానే చెబుతూ ఉండాలి సార్ మీరంతా... ఈ రోజు ఇంత పెద్ద వేడుక జరుపుకోవడం మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటుంది... అని మహేష్ బాబు వ్యాఖ్యానించారు.

    నాలుగేళ్లలో రెండు సార్లు లైఫ్ ఇచ్చారు

    నాలుగేళ్లలో రెండు సార్లు లైఫ్ ఇచ్చారు

    నాన్నగారి అభిమానులు అందరూ నన్ను సూపర్ స్టార్ సూపర్ స్టార్ అంటూ ఉంటారు. ఆ సూపర్ స్టార్‌కు నాలుగేళ్లలో రెండు సార్లు లైఫ్ ఇచ్చారు శివగారు. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్. ఆయనకున్న నాలెడ్జ్ గురించి, ఆయనకు తెలిసిన విషయాల గురించి నేను చెప్పలేను. నాలుగు సినిమాలు చేశారు...నాలుగు బ్లాక్ బస్టర్స్. ఎక్స్‌ట్రార్డినరీగా కథ చెబుతారు. ఇవి కాకుండా అతడికి చాలా విషయాలు తెలుసు. వచ్చాడయ్యో సామీ పాటలో అందరినీ చూసి దండం పెట్టే సీన్ చేసేపుడు నేను మామూలుగా దండం పెట్టాను. ఆయన వచ్చి దండం గుండెలపైన ఉండాలి అని చెప్పారు. ఇలా ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నారు.... అని మహేష్ బాబు గుర్తు చేసుకున్నారు.

    ఆయన సినిమా ఎడిట్ చేస్తే ఒక టెక్ట్స్ బుక్ లాగా ఉంటుంది

    ఆయన సినిమా ఎడిట్ చేస్తే ఒక టెక్ట్స్ బుక్ లాగా ఉంటుంది

    ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ సార్ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన సాధారణంగా ఫంక్షన్లకు రారు.... మీకు ఎన్ని అవార్డులు వచ్చాయో నాకు తెలియదు సార్. నాతో, శివగారితో కలిసి చేసినందుకు చాలా థాంక్స్. మీరు సినిమాను ఎడిట్ చేస్తే ఒక టెక్ట్స్ బుక్ లాగా ఉంటుందని నా ఫీలింగ్.... అని మహేష్ బాబు తెలిపారు.

    దేవిశ్రీ ప్రసాద్ గురించి మహేష్ బాబు

    దేవిశ్రీ ప్రసాద్ గురించి మహేష్ బాబు

    దేవిశ్రీ గురించి చెప్పాల్సిందంతా చెప్పేశాను. ఇంకా ఏం చెప్పాలో తోచడం లేదు. అతడి కమిట్మెంట్, పాషన్, అతడు పని చేసే విధానం నాకు ఎంతో నచ్చింది. మిగతా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థాంక్స్.

    దానయ్యగారు కలెక్షన్లు అదిరిపోతున్నాయి

    దానయ్యగారు కలెక్షన్లు అదిరిపోతున్నాయి

    నిర్మాత దానయ్యను ఉద్దేశించి మహేష్ బాబు మాట్లాడుతూ ‘సార్ మన సినిమా కలెక్షన్లు అదిరిపోతున్నాయి...మీ ఎనర్జీ ఇలాగే ఉండాలి. మీరు ఇలానే గొప్ప సినిమాలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అని వ్యాఖ్యానించారు.

    దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

    దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

    ఈ సినిమాను ఆదరించి నాన్నగారి అభిమానులకు, నా అభిమానులకు ధన్యవాదాలు. మీ అందరూ మాకు ఇచ్చిన ఈ విజయం ఎప్పటికీ మరిచిపోలేను. ఇలాగే శ్రద్ధతో అంత:కరణ శుద్ధితో సినిమాలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... అని మహేష్ బాబు తన ప్రసంగం ముగించారు.

    English summary
    Mahesh Babu Speech At Bharat Blockbuster Celebrations. Bharat Ane Nenu Movie, starring Superstar Mahesh Babu, Kiara Advani, Prakash Raj, Sarath Kumar, Rao Ramesh, Ravi Shankar, Posani Krishna Murali, Aamani, Jeeva, Benarjee, Brahmaji, Ajay Kumar, Sithara, Rajitha, Prithviraj, Devraj, Yashpal Sharma. Directed by Siva Koratala, Music composed by Rockstar Devi Sri Prasad, Cinematography by Ravi K Chandran, S Thirunavukkarasu, Editing by Sreekar Prasad, Production Design by Suresh Selvarajan, Lyrics by Ramajogayya Sastry, Produced by DVV Danayya under DVV Entertainment banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X