‘మహర్షి’ సక్సెస్ మీట్లో కాలర్ ఎగరేసిన మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత దిల్ రాజు, అశ్వినీదత్ ఆదివారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు అల్లరి నరేష్, దేవిశ్రీ ప్రసాద్; పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘మహర్షి’ విజయం అందరి అమ్మలకు అంకితం
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ... ‘‘ఈ రోజు చాలా స్పెషల్ డే.. మదర్స్ డే. నాకు అమ్మంటే దేవుడుతో సమానం. ఏ సినిమా రిలీజ్ అవుతున్నా ముందు అమ్మదగ్గరకు వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. ఆవిడ ఆశీస్సులు నాకు చాలా ముఖ్యం. ‘మహర్షి' విజయాన్ని అందరు అమ్మలకు డెడికేట్ చేస్తున్నాను.'' అన్నారు.

ఈ మూడేళ్లలో ఎన్నో జ్ఞాపకాలు
ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత 3 సంవత్సరాల ప్రాసెస్ జరిగింది. ఈ మూడేళ్లలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. దిల్ రాజు గారు కథ విన్నపుడు మీరు చెప్పినట్లే క్లాసిక్ అన్నారు. లాస్ట్ ఇయర్ దత్తుగారు కథ విని ఈ సినిమా ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుంది ప్రిన్స్ అన్నారు. నేను క్రికెట్‌కు పెద్ద అభిమానిని. ఇండియా- శ్రీలంక మ్యాచ్ ముంబైలో చూశాను. లాస్ట్ బాల్ ధోనీ 6 కొట్టినపుడు విపరీతంగా చప్పట్లు కొట్టాను. ఈ సినిమాపై డబుల్ పాజిటివ్ హైప్ రావడం చూసి రాజుగారు సిక్సర్ అన్నాడు. మళ్లీ అదే ఆనందం వచ్చిందని మహేష్ బాబు గుర్తు చేసుకున్నారు.

ఆడియెన్స్, ఫ్యాన్స్ కి హ్యాట్సాఫ్
దత్ గారు, దిల్ రాజు గారు, పివిపిగారి పెద్ద బ్యానర్లు నా 25వ సినిమా ని ప్రొడ్యూస్ చేయడం గర్వంగా ఉంది. ఇంత బిగ్గెస్ట్ హిట్ చేసిన ఆడియెన్స్, ఫ్యాన్స్ కి హ్యాట్సాఫ్. నరేష్ గారు థాంక్యూ సోమర్ సర్. మీరు ఒప్పుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.

కాలర్ ఎగరేసిన మహేష్ బాబు
‘‘వంశీ గురించి ఇప్పటికే చాలా చెప్పాను. ఇపుడు మరో విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ నాన్నగారి అభిమానులు, నా అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరుగుతారు అన్నాడు. వాళ్లు ఎత్తారు... ఇపుడు నేను కూడా కాలర్ ఎగరేస్తున్నాను'' అని వ్యాఖ్యానించారు.

బాక్సాఫీసు వద్ద అదరగొడుతున్న మహర్షి
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కింది. ఈ చిత్రం తొలి 3 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 కోట్లకుపైగా షేర్ వసూలు చేసంది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.


Click it and Unblock the Notifications











