twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందులో నా తప్పుంటే క్షమించండి : మహేష్ బాబు (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''మీరెప్పుడూ (అభిమానులు) నా గుండెల్లో ఉంటారు. వాళ్ల కోసం మంచి సినిమాలు చేసేందుకే ప్రయత్నిస్తుంటా. ('ఆగడు' చిత్రాన్ని ఉద్దేశించి)పోయినసారి కాస్త నిరుత్సాహపరిచాను. అందులో నా తప్పుంటే క్షమించండి. ఈసారి పుట్టినరోజుకు మీ అందరికీ మంచి హిట్ ఇస్తాను.''అన్నారు మహేష్‌బాబు. ఆయన హీరోగా నటించిన 'శ్రీమంతుడు' పాటల విడుదల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అలాగే మహేష్ బాబు కంటిన్యూ చేస్తూ...''దేవిశ్రీ ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఆడియోలో 'జాగో జాగో...' నా కెరీర్‌లో మంచి సాంగ్. కొరటాల శివ ఈ చిత్రాన్ని చెప్పిన దానికన్నా బాగా తీశారు. తండ్రి పాత్రకు జగపతిబాబు గారు ఒప్పుకుంటారో లేదో అని అనుమానం వచ్చింది. కానీ, నేను, కొరటాల శివ కథ చెప్పగానే, వెంటనే ఓకే చెప్పారు. ఆ పాత్రను ఆయనకన్నా ఎవరూ బాగా చేయరు, నేను కమల్‌హాసన్ ఫ్యాన్‌ని. శ్రుతితో సినిమా చేస్తానని అనుకోలేదు. '' అన్నారు.

    ఆయన అన్న మాటలు ఇక్కడ వీడియో లో చూడండి.

    మహేష్‌బాబు మాట్లాడుతూ ''అన్నయ్య వెంకటేష్‌గారికి కృతజ్ఞతలు. ఈ వేడుకకి వచ్చిందుకు. దేవి అంటే నాకు చాలా ఇష్టం. కొరటాల శివ అద్భుతమైన రచయిత. నాకు చెప్పినదానికంటే బాగా తీశాడు. 'శ్రీమంతుడు' లాంటి సినిమా నాతో తీసినందుకు కృతజ్ఞతలు.

    ఈ సినిమా ఒప్పుకొన్నందుకు జగపతిబాబుగారికి కృతజ్ఞతలు. ఆయన తప్ప మరొకరు సెట్‌ అవ్వని పాత్ర అది. రాజేంద్రప్రసాద్‌గారు, సుకన్యగారు, రాహుల్‌ రవీంద్రన్‌ లాంటి నటులతో కలసి నటించడం చక్కటి అనుభవం.''అన్నారు.

    Mahesh Babu Speech at Srimanthudu Audio Launch

    ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ గల్లా జయదేవ్, నిర్మాత ఆదిశేషగిరి రావు, దర్శకులు శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, నటుడు సుధీర్‌బాబు తదితరులు పాల్గొని, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్రసంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, శ్రుతీహాసన్, నటుడు రాహుల్ రవీంద్రన్, కెమేరామన్ మది, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సీవీయం మోహన్ తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

    English summary
    Mahesh Babu Speech at Srimanthudu Audio Launch featuring Mahesh Babu, Shruti Haasan in lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X