twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడేమీ తెలియదు, సినిమా ఇలా ఉందేంటని షాకయ్యా, మావయ్య సపోర్టు ఇచ్చారు: మహేష్ బాబు

    |

    సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై పవర్‌ఫుల్‌ సోషల్‌ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం.

    మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం టెర్రిఫిక్‌ కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా శనివారం విజయవాడలో 'మహర్షి విజయోత్సవం' పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో మహేష్ బాబుతో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

    ఎంత మంది పిల్లలను కాపాడుతున్నారో ఆ దేవుడికే తెలుసు

    ఎంత మంది పిల్లలను కాపాడుతున్నారో ఆ దేవుడికే తెలుసు

    ఆంధ్ర ఆస్పట్ల్స్ నుంచి ఒకాయన వచ్చి పిల్లలకు సర్జరీ చేసే ముందు మహేష్ బాబు పేరు చెబితే నవ్వుతారని అన్నారు. దీనికంటే గొప్ప కాంప్లిమెంట్ నేను నా జీవితంలో వినలేదు. థాంక్యూ సోమచ్. మీతో అసోసియేట్ అవ్వడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ.. కంటిన్యూ ఆల్ ది గుడ్ వర్క్ సర్. హైదరాబాద్‌లో హీల్ ఎ చైల్డ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వారితో కూడా అసోసియేట్ అయ్యాను. ఏడాదికి ఎంత మంది పిల్లలను కాపాడుతున్నారో ఆ దేవుడికే తెలుసు. అలాంటి వారితో అసోసియేట్ అవ్వడం సంతోషంగా, గర్వంగా ఉందని మహేష్ బాబు వ్యాఖ్యానించారు.

    దుర్గమ్మ తల్లి నన్ను ఇక్కడకు పిలుస్తుంది

    దుర్గమ్మ తల్లి నన్ను ఇక్కడకు పిలుస్తుంది

    విజయవాడకు వచ్చి కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని ఇక్కడ ఫంక్షన్ చేస్తే ఆ ఫీలింగే వేరు. నేనెప్పుడూ ప్లాన్ చేసుకుని రాలేదు. నా సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడల్లా దుర్గమ్మ తల్లి నన్ను ఇక్కడకు పిలుస్తుంది. ఈ రోజు కూడా అదే జరిగింది. ‘మహర్షి' విజయోత్సవం ఇక్కడ జరుగడం ఎంతో ఆనందంగా ఉందని మహేష్ చెప్పుకొచ్చారు.

    రాఘవేంద్రరావు మావయ్యకు థాంక్స్

    రాఘవేంద్రరావు మావయ్యకు థాంక్స్

    ‘‘ముందుగా మామయ్య రాఘవేంద్రరావుగారికి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే.. రాజకుమారుడు సినిమా చేసేపుడు నాకు ఎలా మాట్లాడాలో, నడవాలో కూడా తెలియదు. ఆ సమయంలో ఒక 10 రోజులు నన్ను ఫ్రెండులా చూసుకున్నాడు. సినిమా చూసిన తర్వాత కూడా నాకు రాజకుమారుడు అర్థం కాలేదు. ఇదేంటి మామయ్య సినిమా ఇలా ఉంది అన్నాను. ఇది పెద్ద హిట్టవుద్ది... నువ్వు పెద్ద సూపర్ స్టార్ అవతావని ఆ రోజే చెప్పారు. నిజంగా రుణపడి ఉంటాను మామయ్య... థాంక్సూ సోమచ్.. మీరు నా జీవితంలో స్పెషల్ పర్సన్.'' అని మహేష్ వ్యాఖ్యానించారు.

    అందరూ గుర్తుండి పోతారు

    అందరూ గుర్తుండి పోతారు

    ఈ రోజు నా సినిమా పోస్టర్ మీద వైజయంతి బేనర్, దిల్ రాజుగారి బేనర్, పివిపి గారి బ్యానర్. ముగ్గురు కలిసి నా 25వ సినిమా ప్రొడ్యూసర్ చేయడం గర్వంగా ఉంది. దత్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. మళ్లీ నా 25వ సినిమా కూడా ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు పని చేసిన యాక్టర్లు నరేష్ గారు, పూజా గారు అందరూ నాకు గుర్తుండి పోతారు.

    హిట్టవుతుందని అప్పుడే చెప్పాను

    హిట్టవుతుందని అప్పుడే చెప్పాను

    ‘‘ఈ కథ విన్నప్పుడే పెద్ద హిట్టఅవుతుందని తెలుసు. తొలి రోజు షూటింగ్ డెహ్రాడూన్ లో అయినపుడే చెప్పాను ఇది పోకిరి స్కేర్ అవుతుందని, అంత బాగా నచ్చిచింది. ఈ మూడు పాత్రల్లో నాకు బాగా నచ్చి పాత్ర స్టూడెంట్ పాత్రే. అదొక కిక్ ఇచ్చింది. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. సినిమా నచ్చితే మరు ఎలా చేస్తారో తెలుసు. 25వ సినిమా అన్ని సినిమాలను వారంలో దాంటించేశారు. మీకు సలామ్.. మీ గురించి మాటలు లేవు. ఎప్పుడూ చేసేది ఒకటే... చేతులెత్తి దండం పెట్టడం తప్ప.'' అని మహేష్ భావోద్వేగానికి గురయ్యారు.

    English summary
    Mahesh Babu Speech Maharshi Vijayotsavam. Maharshi romantic action drama film written and directed by Vamsi Paidipally and produced by Dil Raju, C. Ashwini Dutt and Prasad V. Potluri, under the banners of Sri Venkateswara Creations, Vyjayanthi Movies and PVP Cinema.The film stars Mahesh Babu, Pooja Hegde in the lead roles, with Allari Naresh,Ananya and Meenakshi Dixit in prominent roles and music is composed by Devi Sri Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X