పూణె ఎయిర్ పోర్టులో మహేష్ బాబు ఇలా..
హైదరాబాద్: మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్. ఇటీవలే ఈచిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పూణెలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా మహేష్ బాబుపై పుణె ఎయిర్ పోర్టులో కొన్ని సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈనేపథ్యంలో మహేష్ బాబు కొందరు అభిమానులు తమ సెల్ ఫోన్ల ద్వారా ఫోటోలు తీసి ఇంటర్నెట్లో వదిలారు.
పుణెలో వారం రోజులపాటు కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. అందులో మహేష్ బాబుతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటోంది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడని అంటున్నారు. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్ శైలికి తగ్గట్టుగా మాస్ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.

దర్శకుడు మాట్లాడుతూ ''నా రెండో చిత్రమే మహేష్‌బాబుతో చేయబోతుండడం ఆనందంగా ఉంది. క్లాస్, మాస్ కలిపిన కథలో మహేష్ పాత్ర ఆకట్టుకొంటుంది. ఈ కథలో అన్ని రకాల వాణిజ్య హంగులూ ఉన్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది ''అన్నారు.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాలు మాట్లాడుతూ... మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసాము అన్నారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











