ఆ ఇద్దరితో కలిసి థమ్సప్ యాడ్ స్పాట్‌లో మహేష్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం థమ్సప్ యాడ్ చిత్రీకరణలో భాగంగా బ్యాంకాక్‌లో ఉన్నాడు. ఇక్కడి స్పాట్‌లోని ఫోటో ఒకటి బయటకు వచ్చింది. పక్క ఫోటో అదే. ఆ ఫోటోలో బ్రాడ్ ఫిట్ పర్సనల్ టైనర్ గ్రెగ్ జౌజాన్ రోచె తో పాటు, కార్పొరేట్ వరల్డ్ క్రియేటివ్ హెడ్ సాయినాథ్ శరబన్ కూడా ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో థమ్సప్ యాడ్ చిత్రీకరణ పూర్తి కానుంది. అనంతరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగులో పాల్గొనేందుకు తిరిగి ఇండియాకి రానున్నాడు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రూపొందుతోంది. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో మరో హీరోగా నటిస్తున్నాడు. జవవరి 18నే మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అయి పూర్తయింది. వైజాగ్ పరిసరాల్లో షూటింగ్ జరిపారు. ఈ చిత్రం సెంకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి 16 నుంచి తమిళనాడులో జరుగనుంది. మహేష్ బాబు కూడా అదే రోజు SVSC టీంలో జాయిన్ కాబోతున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సెకండ్ షెడ్యూల్ పూర్తి కానుంది. అనంతరం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
మహేష్ బాబు త్వరలో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు లెక్చరర్ గా కనిపించబోతున్నారు. ఇందులో మహేష్ షర్ట్ లెస్ గా సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనం ఇవ్వనున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీ కోసం లోకల్ ట్రైనర్ ను తీసుకోవాలని భావించారు. అయితే చివరకు బ్రాడ్ ఫిట్ పర్సనల్ ట్రైనర్ గ్రెగ్ జౌజాన్ రోచె అనే హాలీవుడ్ ట్రైనర్ ను ఇందు కోసం ఎంపిక చేశారు.


Click it and Unblock the Notifications











