ఆగడు: థాంక్స్ చెబుతూ శ్రీను వైట్ల ట్వీట్
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో 'ఆగడు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ ముంబైలో జరుగుతోంది. తాజాగా ముంబై షెడ్యూల్ పూర్తయింది. దీంతో చిత్ర యూనిట్ సభ్యులకు థాంక్స్ చెబుతూ శ్రీను వైట్ల ట్విట్టర్లో ట్వీట్ చేసారు.
జూన్ 15వ తేదీన ముంబై షెడ్యూల్ ప్రారంభమైంది. జూన్ 21 వరకు ముందుగా ప్లాన్ చేసుకున్నప్పటికీ....అంతా కష్టపడి పని చేయడంతో జూన్ 17కే షూటింగ్ పూర్తయింది. ఇక్కడ సినిమాకు సంబంధించిన పలు సీన్లతో పాటు శృతి హాసన్ సాంగును కూడా ఈ సిటీలో చిత్రీకరించారు.

ఈ నేపథ్యంలో జూన్ 18న శ్రీను వైట్ల ట్విట్టర్లో ట్వీట్ చేసారు. 'ముంబాయి షెడ్యూల్ పూర్తయ్యింది. వరుసగా లడఖ్, ముంబై భారీ షెడ్యూల్స్ ని పూర్తి చేసాం. ఇందులో నాకు సపోర్ట్ గా ఉన్న నా టెక్నికల్ టీంకి థాంక్స్' అని శ్రీను వైట్ల ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ముంబై కంటే ముందు లడఖ్, బళ్లారిల్లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరిగింది.
ముంబై తర్వాత కేరళ షెడ్యూలు వెళ్లనున్నారు. కేరళలలో కొన్ని కీలకమైన లవ్ సీన్స్ తీయనున్నారని సమాచారం. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ స్వరాలందిస్తున్నారు. ఈచిత్రంలో మహేష్ బాబుకు జోడీగా తమన్నా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











