మహేష్-శ్రీను వైట్ల చిత్రం ఎలా వుంటుంది?
మహేష్ బాబుతో తాను చేయబోయే చిత్రం ఎలా ఉంటుందో కామిడీ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే..నార్త్ ఇండియా నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్‌కు ఎక్కువ స్కోప్ వుంటుంది. మహేష్‌లోని పొటెన్షియాలిటి మొత్తం ఉపయోగించుకొని ఈ చిత్రాన్ని చేస్తాను. ఇప్పటి వరకు నా నుంచి వచ్చిన చిత్రాల్లో ఇది భిన్నంగా వుంటుంది. నా మార్క్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మాత్రం వదులుకోను అన్నారు.
ఇక ఈ చిత్రం గురించి ప్రత్యేకమైన ఇంటి సెట్ వేయిస్తున్నారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ (డిల్లీ-6,సావారియా ఫేమ్) ని అడుగుతున్నారు. అలాగే ఈ చిత్రంలోనూ బ్రహ్మానందంకు కీలకమైన పాత్ర ఉండబోతోంది. అలాగే మహేష్ గెటప్ ఇప్పటివరకూ ఉండని విధంగా ఉండాలని శ్రీను వైట్ల కసరత్తులు చేస్తున్నారు. వీటితో పాటు ఎలాగు త్రాగుడు సీను కూడా ఉంటుందని వేరేగా చెప్పక్కర్లేదు.


Click it and Unblock the Notifications











