మహేష్ బాబు, శ్రీనువైట్ల చిత్రం లేటెస్ట్ డిటేల్స్

By Srikanya

2010 ఫిబ్రవరిలో మా చిత్రం షూటింగ్ మొదలు కానుంది. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నాను. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఉత్తర భారత దేశంలో సాగుతుందని శ్రీనువైట్ల తను మహేష్ బాబుతో చేయబోయే చిత్రం విషయాలు చెబుతున్నారు. అలాగే ఈ చిత్రాన్ని సూపర్‌ 35 ఎం.ఎం.లో భారీ ఎత్తున చిత్రీకరణ జరుపాలని నిర్ణయించారు. హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. త్రిషతో మళ్ళీ చేసే అవకాశముందని సమాచారం. ఇంతకుముందు అతడులో త్రిష-మహేష్ ల కెమిస్ట్రీ పండటం ఓ కారణమైతే శ్రీను వైట్లకు నచ్చిన హీరోయిన్ ఆమే కావటం మరో విషయం. అందుకే కింగ్ లో ఆమె తో చేసిన శ్రీనువైట్ల వెంటనే తన తర్వాత నమో వెంకటేశలో కూడా ఆమెకు ఆఫర్ ఇచ్చారు.

ఇక వెంకటేష్‌ - శ్రీనువైట్ల కాంబినేషన్‌ లో 'నమో వెంకటేశ' చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర్‌ '14 రీల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌' పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఆ నిర్మాతలు ప్రస్తుతం మనోజ్ హీరోగా వీరు పోట్ల దర్శకత్వంలో బిందాస్,ముళ్ళపూడి వీరభద్ర చౌదరి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా మరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇక మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తుది దశకు చేరుకుంది. డిసెంబరు మొదటివారం నుంచి వికారాబాద్‌లో వేసిన భారీ విలేజ్‌ సెట్‌లో ఆఖరి షెడ్యూలు జరుపుతున్నారు. ఇందులో మహేష్‌ సరసన అనుష్క నటిస్తున్నారు. వీరిద్దరి కలయికలో ఇదే తొలి చిత్రం. కనకరత్న మూవీస్‌ పతాకంపై శింగనమల రమేష్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు మణిశర్మ, కెమెరామన్‌ సునీల్‌ పటేల్‌, ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌, కళాదర్శకుడు ఆనంద్‌సాయి వంటి స్టార్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

అలాగే తనతో 'అతిథి' చేసిన సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మహేష్‌ మరో సినిమా చేయనున్నారు. 'కిక్‌' లాంటి భారీ విజయం తర్వాత సురేందర్‌ రెడ్డి చేస్తున్న చిత్రం ఇదే. ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ అధినేత వెంకట్‌ రూ.40 కోట్లు భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' అనే టైటిల్‌ను నిర్ణయించారు. కథ విని మహేష్‌ ఎంతో ఎగ్జైట్‌ అయ్యారని చెప్తున్నారు. జూన్‌ లో ఈ చిత్రం షూటింగ్‌ మొదలుకానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X