T20 World Cup: నా గుండె ఉప్పొంగింది.. మహేష్ ట్వీట్ వైరల్.. జక్కన్న, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఏమన్నారంటే?
ఉత్కంఠగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో సౌతాఫ్రికా జట్టుపై భారత్ సంచలన విజయం సాధించడం భారతీయులందరిని ఉద్వేగానికి గురి చేసింది. చేజారిన మ్యాచ్‌ను హార్థిక్ పాండ్యా తిరిగి భారత్ పక్షాన చేర్చిన తీరు అందర్నీఆకట్టుకొంటున్నది. అలా ఇండియాకు తిరుగలేని విజయాన్ని అందించి ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు సినీ ప్రముఖులు శుభాభినందనలు తెలియజేస్తున్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితరులు ఏమని విష్ చేశారంటే..
భారత్ ఛాంపియన్‌గా నిలిచిన వెంటనే దర్శక ధీరుడు రాజమౌళి ఉద్వేగానికి గురయ్యాడు. టీ20 వరల్డ్ కప్‌లో మనమే ఛాంపియన్స్. టీమ్ ఇండియాకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు. అలా ఇండియా విజయాన్ని జక్కన్న సెలబ్రేట్ చేసుకొంటూ అభిమానుల్లో జోష్ పెంచారు.

ఇండియా అద్బుతమైన విజయాన్ని అందుకొన్న వెంటనే జూనియ్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. వాటే మ్యాచ్.. భారత ప్రతిష్టను ఆకాశానికి ఎత్తేశారు. టీమ్ ఇండియాకు కంగ్రాట్స్ అంటూ దేవర యాక్టర్ ప్రశంసల జల్లు కురిపించాడు.
అలాగే అల్లు అర్జున్ కూడా ఇండియన్ క్రికెట్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించడంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కంగ్రాట్స్ ఇండియన్ క్రికెట్ టీమ్. భారత్‌కు విజయాన్ని అందించినందుకు అభినందనలు అంటూ కామెంట్ చేశాడు.

టీ20 కప్ మనదే. బ్లూ జర్సీ హీరోలు ఇక వరల్డ్ ఛాంపియన్స్. టీమ్ ఇండియాకు తలవంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మైదానంలో తిరుగులేని పోరాటపటిమ చూపించారు. సూర్య యాదవ్ అద్బుత క్యాచ్‌తో చరిత్ర తిరగరాశాడు. స్టన్నింగ్ మ్యాచ్. చారిత్రాత్మక విజయం చూసి నా గుండె ఉప్పొంగుతున్నది. జై హింద్ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











