మహర్షి శాటిలైట్ హక్కులకు భారీ ధర.. ఆ రికార్డు అధికమించలేకపోయిన మహేష్!
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో మహర్షిపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా మహర్షి చిత్ర శాటిలైట్ హక్కులు భారీ ధరలు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో
మహేష్ బాబు, వంశీ పైడిపల్లి తొలి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. మహేష్ కు ఇది 25వ చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని మంచి సందేశాత్మక అంశలతో రూపొందిస్తున్నారట. రైతు సమస్యలపై ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు పాత్ర మూడు విభిన్న కోణాల్లో ఉండబోతోందని సమాచారం. మే 9న మహర్షి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల సమయం దగ్గర పడుతుండంతో మహర్షి గురించి ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.

శాటిలైట్ హక్కులకు భారీ ధర
మహర్షి చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్ లో భాగంగా ఇటీవల నిర్మాతలు మహర్షి శాటిలైట్, డిజిటల్ హక్కులని భారీ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ జెమిని టివి మహర్షి శాటిలైట్ హక్కులని 16. 8 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్ హక్కులు కూడా మంచి ధరకే అమ్ముడయ్యాయట. అమెజాన్ ప్రైమ్ సంస్థ 11 కోట్లకు డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా శాటిలైట్ డిజిటల్ హక్కుల రూపంలో మహర్షి చిత్రం 27.8 కోట్లు దక్కించుకుంది.

భరత్ అనే నేను రికార్డ్
కానీ మహర్షి చిత్రం మహేష్ భరత్ అనే నేను రికార్డ్ ని అధికమించలేకపోయింది. భరత్ అనే నేను చిత్రానికి గాను నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో 38 కోట్లు వచ్చాయి. మహర్షి ఈ రికార్డుని బ్రేక్ చేయలేకపోయింది. ఇదిలా ఉండగా మహర్షి చిత్రం దాదాపు 60 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి గత చిత్రాల రికార్డ్ బాగా ఉండడంతో మహర్షిపై అంచనాలు పెరిగిపోయాయి.

ప్రీరిలీజ్ బిజినెస్
మహర్షి చిత్ర థియేట్రికల్ హక్కుల బిజినెస్ కూడా ప్రారంభమైందట. బయ్యర్లంతా మహర్షి చిత్రాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఓవర్సీస్ రైట్స్ విషయంలో మాత్రం గందర గోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఏకంగా 18 కోట్లకు డిమాండ్ చేస్తుండడంతో ఈ చిత్ర యూఎస్ హక్కులు దక్కించుకునేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదని వార్తలు వస్తున్నాయి. మహర్షి చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











