Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ ఫ్యాన్స్ లెట్స్ రాక్: స్పైడర్ రిలీజ్ డేట్ పక్కా
విజయదశమి సందర్భంగా ‘స్పైడర్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు 'స్పైడర్' పీఆర్వో బి.ఎ.రాజు ట్విట్టర్లో 'స్పైడర్' రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
ఇదిగో అదిగో అంటూ దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుండీ షూటింగ్ దశలోనే ఉన్న సూపర్‌స్టార్ మహేష్ 'స్పైడర్' చిత్రం విడుదల తేదీ ఎట్టకేలకు కన్ఫామ్ అయింది. తమిళ అగ్ర దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి విడుదలవుతుంది. దసరా కానుకగా సెప్టెంబరు 27న 'స్పైడర్' తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా ఈ విషయమై ప్రకటన చేశారు.
130 కోట్ల భారీ బడ్జెట్ తో
విజయదశమి సందర్భంగా సెప్టెంబరు 27 న ‘స్పైడర్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు 'స్పైడర్' పీఆర్వో బి.ఎ.రాజు ట్విట్టర్లో 'స్పైడర్' రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దగ్గర దగ్గరగా బాహుబలి పార్ట్ వన్ అంత బడ్జెట్ ఇంచు మించు 130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పైడర్ లో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా, రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్ర పోషిస్తుంది.
Recommended Video
'స్పైడర్'ను చెక్కుతున్నాడు
ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది నుంచి 'స్పైడర్'ను చెక్కుతున్నాడు మురుగదాస్. మామూలుగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా.. మురుగదాస్ ఇంత టైం తీసుకునేసరికి అంచనాలు మరింత పెరిగాయి. ఇంకొక్క పాట మినహాయిస్తే 'స్పైడర్' చిత్రీకరణ అంతా పూర్తయింది. సమాంతరంగా ప్రి ప్రొడక్షన్ పనులూ జరుగుతున్నాయి.
పక్కా క్లారిటీ ఏమీ లేదు
అయితే ఈ డేట్ కూడా ఫైనలా లేదంటే మళ్ళీ మార్పు ఉండొచ్చా అన్న విషయం లో మాత్రం పక్కా క్లారిటీ ఏమీ లేదు ఎందుకంటే నందమూరి బాలకృష్ణ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్'ను సెప్టెంబరు 29న రిలీజ్ చేయబోతున్నట్లు ఆ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న రోజే ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాస్త ఆలోచించాలి
మరోవైపు 'స్పైడర్' విడుదల తేదీ విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న టైంలోనే సెప్టెంబరు 21న తమ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు 'జై లవకుశ' టీం ప్రకటించడమూ తెలిసిందే. మరి ఆసమయం లో విడుదల చేయటం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఎక్కువ కాలం గ్యాప్ తీసుకొని వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయిన రికార్డ్ మహేష్ కి ఉంది. మరి ఈ సినిమా ఆ పాత నమ్మకాన్ని తుడిచి పెట్టేలాగానే కనిపిస్తోంది...