మతి పోగొడుతున్న మహేష్ బాబు ఆల్ట్రా స్టైలిష్ లుక్... ‘మహర్షి’ లీక్ పిక్స్
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మహర్షి' చిత్రం ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 18 నుంచి న్యూయార్క్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
కొన్ని రోజులుగా 'మహర్షి' సెట్స్ నుంచి మహేష్ బాబు లుక్‌కు సంబంధించిన ఫోటోలు లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని ఫోటోస్ బయటకు వచ్చాయి. తాజాగా ఆల్ట్రా స్టైలిష్ లుక్‌లో మహేష్ బాబు మతి పోగొట్టేలా దర్శనమిచ్చారు.

ప్రతిష్టాత్మక చిత్రం... అదిరిపోయే లుక్
మహేష్ బాబుకు ఇది 25వ చిత్రం. కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా మాత్రమే కాదు ఇందులో మహేష్ బాబు లుక్ కూడా ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటినీ మించి పోయేలా ఉండబోతోంది.

వంశీ పైడిపల్లి మాస్టర్ మైండ్
మహేష్ బాబుతో సినిమా చేయడానికి వంశీ పైడిపల్లి దాదాపు రెండు సంవత్సరాలు వెయిట్ చేశాడు. తన సినిమాలో సూపర్ స్టార్‌ను ఎలా ప్రజంట్ చేయాలనే విషయమై ఆలోచించేందుకు కావాల్సినంత గ్యాప్ దొరకడంతో తన మాస్టర్ మైండ్‌కు పదును పెట్టి అద్భుతమైన లుక్‌లో మహేష్ బాబును తెరపై ప్రజంట్ చేయబోతున్నారు.

క్లాసు, మాసు ఇష్టపడేలా
ఇటు క్లాస్ ఆడియన్స్‌తో పాటు అటు మాస్ ఆడియన్స్ సైతం మెచ్చేలా మహేష్ బాబును పాత్రను దర్శకుడు తీర్చి దిద్దాడు. అందుకు తగిన విధంగానే డిఫరెంట్ మేకోవర్లతో స్క్రీన్ మీద మహేష్ బాబు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నాడు.

వరుస లీకులు..
అంతా సవ్యంగా సాగుతున్నా.... సెట్స్ నుంచి మహేష్ బాబు లుక్ లీక్ అవుతుండటం చిత్ర బృందాన్ని కలవర పెడుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవి మాత్రం ఆగడం లేదు. మరో వైపు ఈ లీక్ ఫోటోస్ సోషల్ మీడియాలో చూసి ఫ్యాన్స్ థ్రిల్లవుతున్నారు.

మహర్షి
కాగా.. మహర్షి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అశ్వినీదత్, దిల్ రాజు, ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలకమైన పాత్రలో కనిపించున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











