Mahesh Babu: కండలు పెంచేస్తున్న మహేష్.. ఈ ఫొటో చూస్తే ఫ్యాన్స్​కు పూనకాలే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు ప్రతి సినిమాలో కూడా ఒకే తరహా ఫిట్నెస్ తో కనిపిస్తూ ఉంటాడు. గ్లామర్ విషయంలో కాస్త అటు ఇటుగా చేంజ్ అయినప్పటికీ కూడా మహేష్ తన బాడీ విషయంలో మాత్రం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకే తరహా లుక్కును మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కానీ ఈసారి మహేష్ బాబు ఊహించని విధంగా కండలు పెంచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వివరాలలోకి వెళితే..

ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ..

ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ..

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా బెస్ట్ హ్యాండ్సమ్ హీరోల లిస్టు తీస్తే అందులో మహేష్ బాబు కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. అంతగా మంచి క్రేజ్ అందుకున్న మహేష్ బాబు గ్లామర్ మెయింటైన్ చేయడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. అతని డైటింగ్ అలాగే ఫిట్నెస్ సీక్రెట్ గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు.

వయసు పెరుగుతున్నా కూడా..

వయసు పెరుగుతున్నా కూడా..

మహేష్ బాబు హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వయసును ఏమాత్రం పైకి కనిపించకుండా మెయింటైన్ చేస్తున్నాడు. ఒక విధంగా వయసు మళ్ళీ తగ్గుతుంది అనేలా కూడా అతను కనిపిస్తూ ఉండడం విశేషం. మహేష్ బాబుకు 5 పదుల వయసు దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఇంకా పాతికేళ్ల కుర్రాడి తరహాలో కనిపిస్తూ ఉండడం విశేషం.

ఎన్నిసార్లు చూసినా కొత్తగానే..

ఎన్నిసార్లు చూసినా కొత్తగానే..

ఇక మహేష్ బాబు తన లొకేషన్ లో కూడా పెద్దగా మార్పులు చేసిన సందర్భాలు అయితే లేవు. ఒకవేళ చేసినా కూడా ప్రతి సినిమాకు డిఫరెంట్ లుక్స్ అయితే పెద్దగా కనిపించవు. సినిమా కథ ఏదైనా కూడా సరే మహేష్ బాబు హెయిర్ స్టైల్ ను మారుస్తూ మేనేజ్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా మహేష్ బాబును ఎన్నిసార్లు వెండితెరపై చూసినా కూడా కొత్తగానే కనిపిస్తూ ఉంటాడు.

షాక్ ఇచ్చేలా ఫైట్ సీన్స్

షాక్ ఇచ్చేలా ఫైట్ సీన్స్

ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రమే కాకుండా యాక్షన్ ఎలివేషన్స్ కూడా గట్టిగానే ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా షాక్ ఇచ్చేలా ఫైట్ సీన్స్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తాయని కూడా తెలుస్తోంది. మొదట కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తోనే షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

కండలు తిరిగిన బాడీతో మహేష్

కండలు తిరిగిన బాడీతో మహేష్

అయితే ఇప్పుడు మహేష్ బాబు లుక్ చూస్తుంటే సినిమాలో యాక్షన్స్ సీన్స్ కు తగ్గట్టుగా తన ఫిట్నెస్ ను కూడా మార్చుకున్నట్లుగా అర్థమవుతుంది ఇన్ని రోజులు పెద్దగా తన బాడీని చూపించని సూపర్ స్టార్ ఇప్పుడు మాత్రం జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అందులో మహేష్ బాబు కండలు తిరిగిన బాడీతో సరికొత్తగా కనిపిస్తున్నాడు.

రాజమౌళి సినిమా కోసం కూడా..

రాజమౌళి సినిమా కోసం కూడా..

త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా కూడా అడ్వెంచర్ యాక్షన్ మూవీగా రాబోతోంది. అయితే రాజమౌళి ప్రతి సినిమాలో కూడా హీరోలను దాదాపుగా కండలు పెరిగిన బాడీ తోనే చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మహేష్ ముందస్తుగానే ఈ విధంగా ఆలోచిస్తున్నాడు అనేది కూడా ఇప్పుడు అనుమానం కలుగుతుంది. మరి ముందుగా మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో మహేష్ ఎలా కనిపిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X