twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుకుమార్ తెచ్చిన తంట-నొప్పితో మహేష్ బాబు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రితి సానన్ హీరోయిన్. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా మహేష్ బాబు బ్యాక్ పెయిన్‌కు గురయ్యారని తెలుస్తోంది.

    వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం షూటింగుకు బ్రేక్ ఇచ్చి నాలుగైదు రోజుల పాటు రెస్టు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్ బాలీవుడ్ మూవీ 'ఏక్ థా టైగర్'కు అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిశానో కంపోజ్ చేసినట్లు సమాచారం.

    కొన్ని రిస్కీ సీన్లు డూప్‌లతో చేయించాల్సి ఉన్నా.... సీన్లు సహజంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సుకుమార్ మహేష్ బాబును ఒప్పించి ఫైట్ సీన్స్ చేయించారని, సుకుమార్ ప్లాన్ బెడిసి కొట్టడం వల్లనే ఇలా ఆయన బ్యాక్ పెయిన్ బారిన పడాల్సి వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. ఏది ఏమైనా మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

    ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే... ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ -స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

    English summary
    Film Nagar Buzz is that Mahesh was shooting for an action sequence for his new movie under the direction of Sukumar and it is heard that he got a severe cramp in his back. As a result, sources say that Mahesh would be taking few days break from shoot and will take some rest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X