మహేష్-సుకుమార్ మూవీ మళ్లీ షురూ...
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం తర్వాతి షూటింగ్ షెడ్యూల్ ఖరారైంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రానికి సంబంధించిన సాంగ్ కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించగా...సెప్టెంబర్ 17 నుంచి తర్వాతి షెడ్యూల్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్లో కొన్ని సీన్లు చిత్రీకరించనున్నారు. తదనంతరం థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ చేయనున్నారు.
మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
సినిమా కథ విషయానికొస్తే... గోవా బ్యాక్ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో మహేష్ బాబు తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి ప్రధాన పాత్రలుగా మల్టీ స్టారర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











