గోవాలో మహేష్ బాబు షూటింగ్
గోవా: మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. వాస్తవానికి గతంలోనే ఈచిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. అయితే మరోవైపు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్న మహేష్ బాబు ఆ చిత్రం కోసం బల్క్ డేట్స్ ఇవ్వడంతో, పలు కారణాల వల్ల ఆ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడం తదితర కారణాలతో.... సుకుమార్ సినిమాకు ఇంతకాలం పక్కన పెట్టాల్సి వచ్చింది.
ఈ చిత్రంలో మహేష్ సరసన క్రితి సానన్ అనే కొత్త అమ్మాయి అమ్మాయి ఎంపికైంది. ఇప్పటి వరకు మొడలింగ్ రంగంలో రాణిస్తున్న ఆమెకు ఇదే తొలి సినిమా అవకాశం. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు. ఇందుకోసం అయన అమెరికా నుండి ప్రత్యేకంగా ట్రైనర్ ని కూడా తెచ్చుకున్నారు. ఈ చిత్రం 2013 వేసవికి విడుదల కానుంది. వరుస హిట్లతో మహేష్ బాబు కెరీర్ బ్రంహ్మాండంగా సాగుతోంది. మహేష్ బాబుతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించడానికి కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి.
కాగా... మహేష్ బాబుకు మరో నంది అవార్డు దక్కిన విషయం తెలిసిందే. దూకుడు చిత్రంలో నటనకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపిక చేసింది. మహేష్ బాబు కెరీర్లో ఇది మూడో నంది అవార్డు.


Click it and Unblock the Notifications











