మహేష్, సుకుమార్ సినిమా లేటెస్ట్ ఇన్ఫో
మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్ లో ఆ మధ్యన ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్క్రిప్టుని రీసెంట్ గా సుకుమార్ గోవాలో పూర్తి చేసుకుని వచ్చారు. మహేష్ చేత ఓకే చేయించుకుని ఆయన ప్రస్తుతం నటీనటులును ఎంపిక చేస్తూ బిజీగా ఉన్నారు. మరో ప్రక్క సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజికల్ సిట్టింగ్స్ జరుపుతున్నారు. దేవి ఈ చిత్రం తనకు ప్రమోషన్ గా భావించి ఎలాగైనా మ్యూజికల్ గా పెద్ద హిట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఓ మోడల్ ని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అలాగే సినిమా ధ్రిల్లర్ అని చెప్తున్నారు. గతంలో మహేష్ తో దూకుడు తీసిన నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రియల్ రెండవ వారంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మరో ప్రక్క మహేష్ బాబు ..దిల్ రాజు నిర్మిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందుతన్న ఈ చిత్రంలో వెంకటేష్ మరో హీరో గా చేస్తున్నారు. సమంత ..మహేష్ ప్రక్కన మరో సారి చేస్తోంది. కుటుంబ విలువల నేపద్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











