మహేష్ బాబు-సుకుమార్ చిత్రం ముహూర్తం ఖరారు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఫిబ్రవరి 2న జరుగనుంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవానికి సంబందించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే నెల నుంచి చిత్రం షూటింగ్ సైతం ప్రారంభం కానుంది.
ఇది వరకు మహేష్ బాబుతో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించి నిర్మాతలు అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటించనుంది. తొలి సారిగా దేవి శ్రీప్రసాద్ మహేష్ బాబు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రం అభిమానులు కోరుకునే అన్నికమర్షియల్ అంశాలతో తెరకెక్కనుంది.
మహేష్ బాబు మరో వైపు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబు సరసన సమంత నటిస్తోంది. వెంకటేస్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











