మహేష్ అనారోగ్యం, షూటింగ్ రద్దు చేసిన సుకుమార్
సూపర్ స్టార్ మహేష్ బాబు అనారోగ్యం పాలయ్యారు. దీంతో దర్శకుడు సుకుమార్ షూటింగ్ రద్దు చేశారు. అయితే అభిమానులు ఖంగారు పడాల్సిన పనేమీ లేదు. ఆయనకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారంతే. ఒకటి రెండు రోజుల విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి షూటింగులో పాల్గొనబోతున్నారు.
వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఈచిత్రం షూటింగు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇక్కడ మహేష్ బాబు, కాజల్ పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.
అయితే విపరీతమైన డస్ట్ కారణంగా మహేష్ అలర్జీ భారిన పడి అస్వస్థతకు గురి కావడంతో దర్శకుడు సుకుమార్ ఒక రోజు షూటింగ్ కేన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు పరిస్థితిని బట్టి షూటింగ్ ప్రారంభం కానుంది. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో పాట చిత్రీకరిస్తున్నారు. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సంక్రాంతి నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా కథ విషయానికొస్తే... గోవా బ్యాక్ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో మహేష్ బాబు తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











