మహేష్ బాబు-సుకుమార్ చిత్రం షురూ...
సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందబోతున్న చిత్రం షూటింగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయింది. తొలుత మహేష్ బాబు-కాజల్ అగర్వాల్‌లపై పాట చిత్రీకరిస్తున్నారు. ఇందు కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ వేశారు.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో పాట చిత్రీకరిస్తున్నారు. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సంక్రాంతి నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా కథ విషయానికొస్తే... గోవా బ్యాక్ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో మహేష్ బాబు తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి ప్రధాన పాత్రలుగా మల్టీ స్టారర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











