For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు న్యూ లుక్

    By Bojja Kumar
    |

    గోవా: మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు కొత్తలుక్ తో కనిపించనున్నారనే విషయం ఇప్పటికే పాఠకులకు తెలియజేస్తాం. ఇక్కడ ఫోటటో కనిపిస్తున్నది మహేష్ బాబు న్యూలుక్. మహేష్ హెయిర్ స్టయిల్ తో పాటు బాడీలో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి కదూ...ఈ ఫోటో సంగీత దర్శకుడు దేవిశ్రీ తన ట్విట్టర్లో పోస్టు చేసాడు.

    వాస్తవానికి గతంలోనే ఈచిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. అయితే మరోవైపు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్న మహేష్ బాబు ఆ చిత్రం కోసం బల్క్ డేట్స్ ఇవ్వడంతో, పలు కారణాల వల్ల ఆ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడం తదితర కారణాలతో.... సుకుమార్ సినిమాకు ఇంతకాలం పక్కన పెట్టాల్సి వచ్చింది.

    ఈ చిత్రంలో మహేష్ సరసన క్రితి సానన్ అనే కొత్త అమ్మాయి అమ్మాయి ఎంపికైంది. ఇప్పటి వరకు మొడలింగ్ రంగంలో రాణిస్తున్న ఆమెకు ఇదే తొలి సినిమా అవకాశం. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

    సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు. ఇందుకోసం అయన అమెరికా నుండి ప్రత్యేకంగా ట్రైనర్ ని కూడా తెచ్చుకున్నారు.

    English summary
    Mahesh Babu's Sukumar movie look : This could well be superstar Mahesh Babu's new look for his forthcoming untitled film, directed by Sukumar. Recently the film's music director Devi Sri Prasad dropped in on the sets of the film and spent some quality time with the actor and director. Devi shared this picture on his micro blogging site.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X