సెంటిమెంట్ ఫాలో అవుతూ మహేష్ బాబు ఫస్ట్ లుక్
అయితే ఇలా కృష్ణ గారి పుట్టిన రోజునే గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,దూకుడు చిత్రాల ఫస్ట్ లుక్ లు విడుదల చేసారు. ఆ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేఫద్యంలో ఈ కొత్త చిత్రం కు సెంటిమెంట్ గా అదే రోజు ఫస్ట్ లుక్ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
మహేష్‌బాబు హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న చిత్రం టైటిల్ అంటూ ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అవేవీ కాదని దర్శకుడు స్పష్టం చేశారు. ఇంతకీ ఏ టైటిల్ నిర్ణయించారన్నది తెలిసేందుకు కొద్ది రోజులు వేచి చూడాలి.
మహేష్‌తో 'దూకుడు' తీసిన 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాల్ని హైదరాబాద్ పరిసరాల్లో తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే మూడు పాటలు, మూడు పైట్స్ షూట్ చేసారు. ఈ చిత్రం ద్వారా కృతి సనన్ హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమవుతుంది. ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు, రత్నవేలు ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications












