మహేష్ ఆలోచనలో మరికొంత మంది కుర్ర హీరోలు.. స్పెషల్ ప్లాన్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్న రోజుల్లో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇండస్ట్రీలో కొత్త తరానికి తనదైన శైలిలో అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయిన ప్రిన్స్ G మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ స్థాయిని కూడా పెంచాలని ఆలోచిస్తున్నాడు. అగ్ర హీరోలు చిన్న హీరోలకు సపోర్ట్ చేస్తే ఇండస్ట్రీలో అంతకంటే మంచి సాయం మరొకటి ఉండదు.
అందుకే మహేష్ రానున్న రోజుల్లో వీలైనంత వరకు అప్ కమింగ్ హీరోలకు సపోర్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అడివి శేష్ తో మేజర్ అనే సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కబోతోంది. ఇక నెక్స్ట్ నవీన్ పొలిశెట్టితో కూడా ఒక డిఫరెంట్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. అంతే కాకుండా మరికొంత మంది యువ హీరోలను కూడా లైన్ లో పెట్టె ఛాన్స్ ఉందట.

ఆ లిస్టులో రాజ్ తరుణ్, సత్యదేవ్, సిద్దు జొన్నలగడ్డ వంటి టాలెంటెడ్ హీరోలతో కూడా సినిమాలు చేయాలని అనుకుంటున్నారట. చూస్తుంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి అవకాశాలు అందుకుంటున్న హీరోలకే మహేష్ అవకాశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాలు మహేష్ బాబుకు ఎలాంటి గుర్తింపును అందిస్తాయో చూడాలి. ఇక నెక్స్ట్ మహేష్ సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











