శ్రీను వైట్ల, నేను కారులో ఉన్నప్పుడే...: మహేష్ బాబు
శ్రీను వైట్ల, నేను కారులో ఉన్నప్పుడు నాన్న ఫోన్ చేసి, ఈ చిత్రం 80 కోట్ల కలెక్షన్లకు చేరువువతుందని చెప్పడం... అది ఈ రోజు అక్షరసత్యం కావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని చూసి, నాన్నగారు తొలి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆయనదే తొలి కాంప్లిమెంట్. ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని ముంబాయిలో చూసి, కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉందంటూ కితాబునిచ్చారు. కొన్ని సన్నివేశాల్లో బ్రహ్మానందాన్ని మించి కామెడీని చేశారని పూరి ప్రశంసించారని, అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది. దర్శకుడు రాజమౌళి కూడా అభినందించారు అంటున్నారు మహేష్ బాబు. అలాగే 'త్రీ ఇడియట్స్' హిందీ చిత్రం కలెక్షన్ల పరంగా విదేశాల్లో మొదటిస్థానంలో ఉంది.
ఇప్పుడు దానితర్వాతి స్థానం 'దూకుడు'కు లభించింది. నైజాం కలెక్షన్లతో సమానంగా ఓవర్‌సీస్‌లో ఈ చిత్రం వసూలుచేసింది అన్నారు. ఇక అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అంచనాలకు మించిపోయి విజయం సాధించడం వారిలో ఎనలేని ఉత్సాహాన్ని కలుగజేస్తోంది. ఇక ఈ చిత్రం విడుదల రోజునే నేను 'బిజినెస్‌మేన్' షూటింగ్ కోసం ముంబాయి వెళ్లిపోవడంతో సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను. అలాగే విజయయాత్రలో మిగతా యూనిట్ సభ్యులతో కలసి పాల్గొనలేకపోయాను. విజయయాత్రకు కూడా అనూహ్యమైన స్పందన లభించింది. త్వరలో నేను కూడా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తాను అన్నారు.


Click it and Unblock the Notifications











