'ఖలేజా' తో నేను చాలా హ్యాపీగా ఉన్నా...మహేష్ బాబు
మహేష్ బాబు రీసెంట్ గా ఖలేజా గురించి మాట్లాడటానికి మీడియాతో హైదరాబాద్ లోని ఇష్టా హోటల్ లో సమావేశమయ్యారు. మహేష్ మాట్లాడుతూ..కలెక్షన్స్ గురించి నేను చాలా హ్యాపీగా ఉన్నాను.నా కెరీర్ లో వచ్చిన బెస్ట్ ఓపినింగ్స్ లో ఇదొకటి. అయితే కొంతమంది ఇంకా బెటర్ గా చేయచ్చు అన్నారు. కానీ ఓవర్ ఆల్ గా ఫీడ్ బ్యాక్ అంతా ఎక్సట్రీమ్ లీ పాజిటివ్. అయినా చివరకు కలెక్షన్స్ ఎంతొచ్చాయన్నదే మ్యాటర్.
అలాగే నేను సినిమా చేసి తర్వాత చూసుకున్నప్పుడల్లా..ఇంకా బాగా చేసి ఉండాల్సిందే అనుకుంటూ ఉంటాను. అయితే ఖలేజా చూసాక వావ్ ఎంత బాగా వచ్చింది అనుకున్నా. అలాగే క్యారెక్టర్ లో అధ్బుతమైన కన్సిటెన్సీ మెయింటైన్ చేసారు. అది బాగా నచ్చింది. కామిడీ అని అనుకున్నప్పుడు కామిడీ చేయ్యకుండా క్యారెక్టర్ యాటిట్యూడ్ వైజ్ సినిమా అంతా కామిడీ చేస్తూనే ఉన్నాను. ఇది నాకొక మెమరిబుల్ ఫిల్మ్.
ఇక త్రివిక్రమ్ తో నాకున్న అనుభంధం ప్రత్యేకమైంది. నాకు అతనెప్పుడూ బెస్ట్ అనుకున్నవే ఇచ్చాడు. అలాగే ఈ చిత్రంలో కామిడీ చేయటాన్ని బాగా ఎంజాయ్ చేసాను. అలాగే నేను నా పాత్రను బాగా ఎంటర్టైనింగ్ చేయటాన్ని నచ్చిందంటున్నారు. అయితే నేను కమిడియన్స్ ని డామినేట్ చేసి ఉండచ్చు కానీ అలా నా పాత్రను డిజైన్ చేసారు.టోటల్ గా ప్రేక్షకులను పూర్తిగా ఆనందపరచాలనుకున్నాం అన్నారు. ఇక నేరేషన్ లో కన్ఫూజన్ వచ్చిందన్న విషయాన్ని మహేష్ కొట్టిపారేశారు. ఫస్ట్ హాఫ్ అంతా రాజస్ధాన్ లో ప్లాన్ చేసాం. పోస్ట్ ఇంటర్వెల్ సీన్స్ కి విలేజ్ కు వచ్చేసాం. అది క్లియర్ గా డిఫైన్ చేసాం. ఎక్కడుంది ప్లాబ్లం అన్నారు. ఇక ఈ సమావేశంలో త్రివిక్రమ్,నిర్మాత సి.కళ్యాణ్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











